Space X: దూరమెంతైనా సరే..గంటలోగా ఆయుధాల సరఫరా

అంతరిక్షరంగంలో పురోగతి సాధించిన సంస్థ స్పేస్ ఎక్స్ మరో అద్భుత ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రపంచంలోని ఏ దేశానికైనా గంటలో ఆయుధాలు తీసుకెళ్లే రాకెట్ తయారు చేయనుంది.

Last Updated : Oct 9, 2020, 08:51 PM IST
Space X: దూరమెంతైనా సరే..గంటలోగా ఆయుధాల సరఫరా

అంతరిక్షరంగంలో ( Space Sector ) పురోగతి సాధించిన సంస్థ స్పేస్ ఎక్స్ ( Space X ) మరో అద్భుత ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రపంచంలోని ఏ దేశానికైనా గంటలో ఆయుధాలు తీసుకెళ్లే రాకెట్ తయారు చేయనుంది.

ఎలాన్ మస్క్ ( Elon Musk ) కు చెందిన అంతరిక్ష ప్రయోగశాల స్పేస్ ఎక్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అంతరిక్షరంగంలో ఈ సంస్థ సాధించిన పురోగతి చెప్పుకోదగ్గది. ఇప్పటికే అంగారకుడిపై మానవుల్ని తీసుకెళ్లే మిషన్ చేపట్టింది. ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగాన్ని చేపట్టనుంది.    ప్రపంచంలో ఏ దేశానికైనాసరే గంటలోగా ఆయుధాలు తీసుకెళ్లి దించి వచ్చే రాకెట్‌ను తయారు చేసేందుకు అమెరికా సైన్యంతో ఒప్పందం చేసుకుంది. ఓ ప్రాంతానికి ప్రయోగించిన రాకెట్‌ను తిరిగి తీసుకొచ్చి మళ్లీ ఉపయోగించడంలో ఇప్పటికే విజయం సాధించిన స్పేస్‌ ఎక్స్‌ కార్గో రాకెట్‌ ( Space X cargo rocket ) .. సరుకు రవాణా చేసే రాకెట్‌ను తయారు చేయనుండటం ఇదే తొలిసారి.

ఈ ప్రయత్నంలో విజయం సాధించేందుకు సంస్థకు అనుబంధంగా ఉన్న వైమానిక సంస్థ ఎక్స్‌ ఆర్క్‌ సహకారాన్ని కూడా తీసుకుంటోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు 7 వేల 500 మైళ్ల దూరంలో ఉన్న అఫ్ఘానిస్థాన్‌లోని అమెరికా ( America ) వైమానిక స్థావరానికి ఆయుధాలను గంటలో చేరవేయడం ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యంగా ఉంది. ప్రస్తుతం కార్గో విమానం ద్వారా అక్కడికి ఆయుధాలను చేరవేయడానికి 15 గంటల సమయం పడుతోంది. అతి వేగంగా ఆయుధాలను తరలించే అత్యాధునిక కార్గో విమానాలు అమెరికా వద్ద ప్రస్తుతం 233 ఉన్నాయి. అయితే వాటి గరిష్ట వేగం గంటకు 590 మైళ్లే. 80 టన్నుల సరకు రవాణా చేసేందుకు వీలుగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించారు.

ఇప్పుడీ రాకెట్ ప్రయోగం విజయవంతమైతే..కచ్చితంగా ప్రపంచంలోని ఆయుధ కంపెనీలకు ఓ వరంగా మారనుంది. అందుకే  వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌ పనులపైనే అందరి దృష్టీ నెలకొంది. కదనరంగంలో ఉన్న దేశాలకు ఈ ప్రయోగం చాలా లబ్ది చేకూర్చనుంది. Also read: Pakistan Banned TikTok: చైనాకు షాకిచ్చిన పాకిస్తాన్, టిక్‌టాక్‌ బ్యాన్!

Trending News