అమరావతి: ఏపీలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ( Heavy rain ) ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో రాష్ట్రం నలుమూలలా నదులు, కాల్వలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, వరద ప్రభావం అధికంగా కనిపిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ( West Godavari ) తమ్మిలేరు, ఎర్రకాల్వ పొంగి ప్రవహిస్తున్నాయి. ఏలూరు, నిడదవోలు, దెందులూరు, తాడేపల్లిగూడెం, భీమవరం పరిసర మండలాల్లో వరద ప్రభావం తీవ్రత ఎక్కువగా ఉంది. తమ్మిలేరు కాల్వకు ( Tammileru ) గండి పడే ప్రమాదం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య అటువైపుగా రాకపోకలు నిలిపేశారు. తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో ఎర్రకాల్వకు ( Yerrakaluva ) గండిపడటంతో పరిసర గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. దెందులూరు మండలం సత్యనారాయణపురంలోనూ గండేరువాగుకు ( Ganderuvaagu ) గండ్లు పడటంతో అక్కడ సైతం లోతట్టు ప్రాంతాలు పూర్తి జలమయమయ్యాయి. Also read : Kishan Reddy: అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు
#WATCH आंध्र प्रदेश के ईस्ट गोदावरी जिले में भारी बारिश के चलते कई घर पानी में डूब गए हैं। एक मकान ढहकर पानी के तेज बहाव के साथ बह गया। pic.twitter.com/0WbTh3Wn32
— ANI_HindiNews (@AHindinews) October 14, 2020
మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలోనూ ( Rain in East Godavari dist ) ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, పెద్దాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. జగ్గంపేట మండలం రామవరంలో వరద తాకిడికి కొత్తగా నిర్మించిన ఇల్లు కూలి వరదలోనే కొట్టుకుపోయింది ( House washed away in flood). Also read : AP: భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe