Arvind Kejriwal - Coronavirus vaccine | న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాక్సినేషన్‌కు ఢిల్లీ ప్రభుత్వం (Delhi) సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇప్పటికే వ్యాక్సినేషన్ (vaccination)కు సంబంధించిన ప్రణాళికలన్ని పూర్తిచేశామని కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు అరవింద్ కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు.
ప్రాధాన్యత క్రమంలో (Coronavirus) వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడానికి అదేవిధంగా కోవిడ్ 19 వ్యాక్సిన్ నిల్వ చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt) సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. మొదటి విడుత వ్యాక్సినేషన్‌లో భాగంగా టీకా తీసుకోవడానికి ఢిల్లీలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 50ఏళ్లు పైబడిన వారు సుమారు 51 లక్షల మంది ఉన్నారని చెప్పారు.
Delhi govt has completed all preparations & is ready for vaccination. There are around 51 lakh people including healthcare & frontline workers who would get vaccine in the first phase. The process of identification of all such people is almost complete: Delhi CM Arvind Kejriwal https://t.co/Lf8WyJYMjA pic.twitter.com/vjATScI1oj
— ANI (@ANI) December 24, 2020
వీరందరికీ ఒక్కొక్కరికి రెండు డోసుల చొప్పున మొత్తం 1.02 కోట్ల (COVID-19 vaccine) డోసులు ఢిల్లీకి అవసరమవుతాయని వెల్లడించారు. ప్రస్తుతం తమకు 74 లక్షల డోసులను నిలువ చేసుకునే సామర్ధ్యం ఉన్నదని, మరో వారం రోజుల్లో దానిని 1.15 కోట్లకు పెంచుకుంటామని కేజ్రీవాల్ (Arvind Kejriwal) తెలిపారు. కరోనా టీకా తీసుకునే వారిని గుర్తించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని వెల్లడించారు. Also Read: Farm Laws: పెట్టుబడిదారుల కోసమే ప్రభుత్వం: రాహుల్ గాంధీ
దేశంలో (Covid-19) వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరిలో ప్రారంభమవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేజ్రీవాల్ వ్యాక్సినేషన్ సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు. Also read; Farmer protests: వ్యవసాయ చట్టాల ప్రతులను చింపేసిన సీఎం కేజ్రీవాల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook