New coronavirus strain: బ్రిటన్ నుంచి విస్తరిస్తున్న కొత్త కరోనా వైరస్ ఆందోళన కల్గిస్తోంది. ఇండియాలో సైతం ఆరు కేసులున్నట్టు నిర్ధారణ కావడంతో కలవరం కల్గిస్తోంది. అయితే అంత ప్రమాదకరమా కాదా అనే విషయంలో స్పష్టత వచ్చింది.
యూకే ( UK ) లో వెలుగు చూసిన కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ ( New Coronavirus strain ) గురించే ఇప్పుడంతా చర్చ నడుస్తోంది. యూకే నుంచి ప్రారంభమై ఇప్పటికే పలు దేశాలకు విస్తరించింది. పాత కరోనా వైరస్ ( Coronavirus ) తో పోలిస్తే..సంక్రమణ వేగంగా ఉంటుందనడంతో ఆందోళన ఎక్కువవుతోంది. బ్రిటన్ ( Britain ) నుంచి ఇండియాకు తిరిగొచ్చిన 33 వేల మందిలో 114 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా..కొత్త స్ట్రెయిన్ ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోడానికి సీసీఎంబీ ( CCMB ), నిమ్హాన్స్ ( Nimhans ), ఎన్ఐవీ ( NIV ) సంస్థల్లో తదుపరి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో 114మందిలో ఆరుగురిలో కొత్త స్ట్రెయిన్ ఉన్నట్టు తేలింది.
అయితే కొత్త కరోనా స్ట్రెయిన్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ సీసీఎంబీ శుభవార్త అందించింది. యూకే స్ట్రెయిన్ ( Uk Strain ) అంత ప్రమాదకరం కాదని సీసీఎంబీ వెల్లడించింది. కానీ విస్తరణ వేగంగా ఉందని చెప్పింది. ఈ స్ట్రెయిన్‌ను B.1.1.7 రకమని స్పష్టం చేసింది. బ్రిటన్ స్ట్రెయిన్‌కు 71 శాతం వేగంగా వ్యాపించే శక్తి ఉందని...17 రకాల ఉత్పరివర్తనాలు కలిగి ఉందని పేర్కొంది.
Also read: FASTag: ఫాస్టాగ్‌పై సందేహాలున్నాయా..ఫాస్టాగ్ ఎలా పని చేస్తుంది..ఎలా తీసుకోవాలి