అనుకున్నదే అయింది. అధికార పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడిందే నిజమైంది. ఎన్నికల కోడ్ సాకుగా చూపిస్తూ సంక్షేమ పథకాల్ని నిలిపివేయాలని ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Election commissioner Nimmagadda Ramesh Kumar ) మళ్లీ వివాదానికి తెర లేపారు. జనవరి 8వ తేదీ రాత్రి హఠాత్తుగా పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ( Local body Elections schedule ) ప్రకటించి వివాదానికి తెర లేపిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది కాబట్టి ఎన్నికల కోడ్ ( Election code ) అమల్లోకి వస్తుందని..సంక్షేమ పథకాల్ని నిలిపివేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ జారీ చేసిన ఈ ఉత్తర్వులతో లక్షలాదిమంది తల్లులు ఎదురుచూస్తున్న అమ్మఒడి పథకం డబ్బులకు ఇబ్బంది ఎదురైంది. అటు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇళ్ల పట్టాల పంపిణీపై కూడా ఆంక్షలు విధించారు.
ఇప్పటికే అమ్మ ఒడి పథకం ( Amma vodi scheme ) కార్యక్రమానికి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. సంక్షేమ పధకాల ( Welfare schemes )పై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తా వించినా..బడ్జెట్ కేటాయింపుల్లో ఉన్నా రే..పథకాల అమలు ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ( Sec Nimmagadda Ramesh kumar ) జారీ చేసిన ఉత్తర్వుల్లో రాజకీయ అజెండా స్పష్టంగా కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే హఠాత్తుగా పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడే..ఎస్ఈసీ నిర్ణయంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ పథకాల్ని నిలిపివేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని చాలామంది విమర్శించారు. ఈ నేపధ్యంలో విమర్శల్ని నిజం చేస్తూ పథకాలు నిలిపివేయాలంటూ ఆదేశాలు రావడంతో రాజకీయ కుట్ర స్పష్టంగా కన్పిస్తోందని అంటున్నారు.
Also read: AP: ఎస్ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటీషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook