Xiaomi Mi 11: మార్చి 29న లాంఛింగ్‌కు సిద్ధంగా ఎంఐ 11 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, పూర్తి స్పెసిఫికేషన్లు

Xiaomi Mi 11 Features | షియోమి సరికొత్త మొబైల్స్‌ను ఎప్పటికప్పుడూ మార్కెట్‌లోకి ప్రవేశపెడుతుంది. తాజాగా ఎంఐ 11 యూత్ ఎడిషన్‌ను మార్చి 29న లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. 20MP సెల్ఫీ కెమెరాను షియోమీ అందిస్తుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 28, 2021, 01:29 PM IST
Xiaomi Mi 11: మార్చి 29న లాంఛింగ్‌కు సిద్ధంగా ఎంఐ 11 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్, పూర్తి స్పెసిఫికేషన్లు

Xiaomi Mi 11 Specifications: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి సరికొత్త మొబైల్స్‌ను ఎప్పటికప్పుడూ మార్కెట్‌లోకి ప్రవేశపెడుతుంది. తాజాగా ఎంఐ 11 యూత్ ఎడిషన్‌ను మార్చి 29న లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంఐ 11 ప్రో మరియు ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ బ్యాండ్ 6 మరియు కొత్త ఎంఐ మిక్స్ వంటి ఇతర కొత్త మొబైల్ వేరియంట్స్, పరికరాలను లాంచ్ చేయనున్నారు.

ఎంఐ 11 స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఎంఐ 11 యూత్ ఎడిషన్‌లో AMOLED ప్యానెల్ మరియు ఫుల్ హెచ్‌డీ + రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల డిస్‌ప్లే అందిస్తున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90Hz కలిగి ఉంది. అదేవిధంగా 20MP సెల్ఫీ కెమెరాను షియోమీ అందిస్తుంది.

స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 780 5జీ ప్రాసెసర్ అమర్చారు. మరియు రెగ్యూలర్ ఫోన్ల మాదిరిగానే ఇందులో Xiaomi Mi 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ కలిగి ఉంది. డేటా సామర్థ్యాన్ని మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్‌ను కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి. ఎంఐ 11 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ట్రఫుల్ బ్లాక్(Truffle Black), సిట్రస్ ఎల్లో (Citrus Yellow) మరియు మింట్ గ్రీన్ రంగులలో లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం

 

కెమెరాల విషయానికొస్తే, స్మార్ట్‌ఫోన్(Smartphone)‌లో 64 మెగా ఫిక్సల్ ప్రైమరీ సెన్సార్, 8 మెగా ఫిక్సల్ అల్ట్రావైడ్ సెన్సార్ మరియు 5 మెగా ఫిక్సల్ మాక్రో సెన్సార్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 GB అంతర్గత సామర్థ్యంతో తయారుచేశారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4,250 mAH. కాగా ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సర్వీస్‌తో అతివేగంగా ఛార్జింగ్ అవుతుంది.

Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, LTC, మార్చి 31 తుది గడువు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News