SRM Report on Covid19: ఎస్ఆర్ఎం విద్యార్ధుల పరిశోధన, జూలై 15 నాటికి రాష్ట్రంలో కరోనా నిల్

SRM Report on Covid19: కరోనా మహమ్మారి విజృంభణ ఎప్పటి వరకూ. ఇంకెన్నాళ్లీ నరకం. ఎక్కడ విన్నా ఇదే ఆందోళన. కరోనా మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో అని చూస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ఏపీ నుంచి ఊరటనిచ్చే సమాచారం వెలువడుతోంది. ఆ యూనివర్సిటీ విద్యార్ధులు కరోనా సంక్రమణ, ఎప్పటి వరకూ ఉంటుందనే వివరాలు వెల్లడించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 18, 2021, 01:32 PM IST
SRM Report on Covid19: ఎస్ఆర్ఎం విద్యార్ధుల పరిశోధన, జూలై 15 నాటికి రాష్ట్రంలో కరోనా నిల్

SRM Report on Covid19: కరోనా మహమ్మారి విజృంభణ ఎప్పటి వరకూ. ఇంకెన్నాళ్లీ నరకం. ఎక్కడ విన్నా ఇదే ఆందోళన. కరోనా మహమ్మారి ఎప్పుడు తగ్గుతుందో అని చూస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ఏపీ నుంచి ఊరటనిచ్చే సమాచారం వెలువడుతోంది. ఆ యూనివర్సిటీ విద్యార్ధులు కరోనా సంక్రమణ, ఎప్పటి వరకూ ఉంటుందనే వివరాలు వెల్లడించారు.

కరోనా మహమ్మారి (Corona pandemic) శరవేగంగా విస్తరిస్తోంది. గత మూడ్రోజుల్నించి కాస్త తగ్గుముఖం పట్టినా..ఇంకా సంక్రమణ ఆగలేదు. కోవిడ్ మహమ్మారి కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపధ్యంలో ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్శిటీ (SRM University) నుంచి గుడ్‌న్యూస్ అందుతోంది. ఈ సమాచారం కాస్త ఊరటనిచ్చేదిగానే ఉంది. జూలై 15 నాటికి రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తిగా( Coronavirus decreased by July 15) పూర్తిగా తగ్గుముఖం పడుతుందనేదే ఈ సమాచారం. ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ప్రొఫెసర్లు, విద్యార్ధులు ఊరటనిచ్చే కబురు అందించారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్ధులు కలిసి సంయుక్తంగా కోవిడ్ వ్యాప్తి ముగింపు కాలాన్ని శాస్త్రీయంగా అంచనా వేశారు. ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న ఎస్ఐఆర్ సహాయంతో ర్యాండమ్ ఫారెస్ట్ మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్ డేటా తయారు చేశారు. 

కరోనా వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం (Ap government) ఇస్తున్న డేటాను ఎస్ఎస్ఐఆర్ డేటాతో అనుసంధానం చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తిపై అంచనా గణాంకాలు స్పష్టమయ్యాయి. ఇదే పద్ధతిని పాటించిన ఎస్ఆర్ఎం విద్యార్ధులు మార్చ్ 3 వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ఆధారంగా తమ డేటాతో విశ్లేషించారు.ఈ విశ్లేషణ ఆధారంగా మే 21 నాటికి ఏపీలో 10 వేల కేసులు, మే 30 నాటికి 5 వేల కేసులు, జూన్ 14 నాటికి వేయి కేసులు, జూలై నాటికి 5 వందల కేసులు నమోదయ్యే అవకాశముందని ఎస్ఆర్ఎం యూనివర్శిటీ విద్యార్ధులు వెల్లడించారు. జూలై 15 నాటికి ఏపీలో వంద కంటే తక్కువ కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని ఎస్ఆర్ఎం నివేదిక చెబుతోంది. 

Also read: Raghuramakrishnam raju: జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో రఘురామ వైద్య పరీక్షలు ప్రారంభం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News