Gold Mine Collapse: ఆఫ్రికా ఖండ దేశమైన నైజీరియా(Nigeria)లోని దక్షిణ నైజర్‌లో పెను ప్రమాదం జరిగింది. గోల్డ్ మైన్ కూలి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పదు సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే..
నైజీరియా సరిహద్దుల్లోని దక్షిణ నైజర్‌లో ఆర్టిసానల్ గోల్డ్ మైన్(artisanal gold mine) ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదాన్ని డాన్ ఇస్సా జిల్లా మేయర్ అడమౌ గురౌ ధృవీరించారు. ప్రస్తుతానికి 18 మంది చనిపోయారని, మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అనేక మంది పౌరులు గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గ్యారిన్-లిమాన్ గని స్థలంలో ఆర్టిసానల్ బావులు కూలిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు.
Also Read: Mexico accident: కార్లపైకి దూసుకెళ్లిన ట్రక్కు... 19 మంది దుర్మరణం!
రెస్క్యూ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయని, శిథిలాల్లో ఇంకా మృతదేహాలు చిక్కుకుని ఉండవచ్చునని అన్నారు. అయితే ఈ గ్యారిన్-లిమాన్ గనులను కొన్ని నెలల క్రితమే కొనుగొన్నారు. అక్కడ తవ్వకాలు చేపట్టారు. అయితే, అక్కడి నేల అస్థిరత కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయని చెబుతున్నారు. మైనింగ్‌లో పాత పద్ధతులు పాటించడం కూడా ఈ ప్రమాదానికి ఒక కారణం అని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్ సెక్టార్‌ను ఆధునీకరించే ప్రయత్నాల్లో భాగంగా అక్కడి ప్రభుత్వం 2017లోనే అనేక ఆర్టిసానల్ గోల్డ్‌మైన్‌లను మూసివేసింది. లోహాలకు డిమాండ్ పెరుగుతున్న నేపధ్యంలో...పేద దేశాల్లో మైనింగ్ జోరుందుకుంది. ఇలాంటి చర్యలు పశ్చిమ ఆఫ్రికాలో సర్వ సాధారణంగా జరుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook