Corona Spread Rate: కరోనా మహమ్మారి విలయ తాండవం ప్రారంభమైపోయింది. ఫిబ్రవరి నాటికి దేశంలో కరోనా వైరస్ పీక్స్‌కు చేరుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకరి నుంచి నలుగురికి వ్యాపిస్తుందని చెప్పడం ఆందోళన రేపుతోంది.
దేశంలో కరోనా థర్ద్‌వేవ్ ప్రారంభమైపోయింది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతుంటే..మరోవైపు ఒమిక్రాన్ కేసులు అధికమౌతున్నాయి. గత మూడు రోజుల్నించి రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో డాక్టర్ జయంత్ ఝా చెబుతున్న మాటలు ఆందోళన కల్గిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి విశ్లేషిస్తే దేశంలో ఫిబ్రవరి 1-15 మధ్య అత్యంత ఉధృతంగా కరోనా కేసులు నమోదవుతాయని అంచనా. ఎందుకంటే దేశంలో ప్రస్తుతం కరోనా ఒకరి నుంచి నలుగురికి వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే కరోనా వైరస్ ఆర్ వాల్యూ లెక్కిస్తే 4 గా తేలింది. ఇదే ఇప్పుడు ఆందోళనకు కారణమౌతుంది. ఒకవేళ ఆర్ వాల్యూ 4 దాటితే పరిస్థితి మరింత ఉధృతం కానుంది. మద్రాస్ ఐఐటీ నిపుణులు చెబుతున్న ఈ అంశాలు కలకలం రేపుతున్నాయి. కరోనా వైరస్ సంక్రమణ తీవ్రతను అంచనా వేసేందుకు ఆర్ వ్యాల్యూని లెక్కగడుతుంటారు.
కోవిడ్ గైడ్‌లైన్స్(Covid Guidelines) జాగ్రత్తగా పాటిస్తే ఆర్ వాల్యూ(Corona R Value) తగ్గవచ్చు. అంటే ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా ఉండటం, మాస్క్ ధరించడం, చేతులు తరచూ కడుక్కోవడం వంటివి కఠినంగా అమలు చేయాల్సి ఉంది. ఎక్కడికక్కడ క్వారంటైన్ అమలు చేయడం కూడా ఇందులో ఓ భాగం.
గత వారం లెక్కగట్టినప్పుడు ఆర్ వాల్యూ 2.69 గా ఉంది. రెండవ దశ ఉధృతిలో ఈ విలువ గరిష్టంగా 1.69 గా ఉంది. కరోనా సెకండ్ వేవ్‌కు( Corona Second Wave) కారణమైన డెల్టా వేరియంట్‌తో పోలిస్తే..ఒమిక్రాన్ ప్రభావం 90-95 శాతం తక్కువగా ఉన్నా..సంక్రమణ వేగం మాత్రం ఎక్కువే. దాంతో ఫిబ్రవరి నాటికి ప్రతిరోజూ దేశంలో 5 లక్షల వరకూ కేసులు నమోదవుతాయని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 3 వేల 623 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, 1409 మంది ఇప్పటికే కోలుకున్నారు. ఇప్పటి వరకూ 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దేశంలో నమోదవుతున్న ఒమిక్రాన్ (Omicron)కేసుల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, రాజస్థాన్, కేరళ, గుజరాత్, తమిళనాడు, హర్యానా, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 1 లక్షా 59 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
Also read: Lockdown: కరోనా మహమ్మారిపై మోదీ సమీక్ష నేడే, లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి