శనివారం పార్లమెంటు హౌస్ సెంట్రల్ హాల్‌లో లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్‌ను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సమావేశాలు రెండు రోజులపాటు జరగనున్నాయి. ఈ కాన్ఫరెన్స్ థీమ్‌ను -'మేము అభివృద్ధి కోసం (We For Development)' అని పేర్కొనడం జరిగింది. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్లమెంటు సభ్యులు, శాసనసభ శాసనమండలి సభ్యులు.. వారి అనుభవాలను ఈ సదస్సు ద్వారా పంచుకోనున్నారు.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. సమతుల అభివృద్ధి సాధించడమనేది మన బాధ్యత కాదా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ నిర్మాణంపై చర్చలు ఇక్కడే జరిగాయని చెప్పారు. ప్రజా ప్రతినిధులు కొత్త విషయాలు నేర్చుకోవడమే ఈ సదస్సు లక్ష్యమని ఆయన అన్నారు.
కాగా, సమావేశంలో అభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తారు. కాన్ఫరెన్స్‌లో సుమారు 175 ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర శాసనసభల ప్రిసీడింగ్ ఆఫీసర్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
In every state there are a few districts where development parameters are strong. We can learn from them and work on weaker districts: PM Modi at National Legislators Conference in Parliament pic.twitter.com/2cieHejLzW
— ANI (@ANI) March 10, 2018