AP capital: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు.. రాజధాని మార్పునకు ఏప్రిల్‌ను తుది గడువుగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏప్రిల్‌లో రాజధానిని త్వరలో అమరావతి నుంచి విశాఖపట్నానికి మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మూడు రాజధానుల అంశాన్ని పక్కనబెట్టి విశాఖపట్నాన్నిఏపీ రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది నుంచి.. విశాఖపట్నం కేంద్రంగా ముఖ్యమంత్రి కార్యకలాపాలు నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
విశాఖపట్నంపై దృష్టి పెట్టండి..
ఇటీవల సినీ పరిశ్రమ వర్గాలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. వారితో భేటీలో కూడా విశాఖపట్నంలో సినిమా పరిశ్రమను విస్తరించాలని కోరారు సీఎం. ఇందుకోసం ప్రభుత్వ సహాయం కూడా ఇస్తామని తెలిపారు.
భూముల గుర్తింపు..
పరిపాలనకు అవసరమైన కొత్త భవనాల నిర్మాణానికి అవసరమైన భూముల గుర్తింపును ప్రారంభించాలని కూడా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ విషయంపై అభ్యంతరాలు తలెత్తితే.. అవి హేతుబద్ధంగా ఉంటే వాటి పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా స్పష్టం చేసినట్లు తెలిసింది.
కొత్త జిల్లాలకు అనుభవజ్ఞులైన కలెక్టర్లు, ఎస్పీలు..
ఇక ఉగాది నుంచే కొత్త జిల్లాలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా సన్నాహాలు ప్రారంభించాలని ఆదేశించారు సీఎం జగన్. కొత్తగా ఏర్పడే జిల్లాలకు అనుభవజ్ఞులైన వారిని నియమించడం ద్వారా పరిపాలన సులభతరమవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు.
Also read: AP New Districts: ఏపీలో మార్చి 18 నాటికి కొత్త జిల్లాలు... ఏప్రిల్ 2 నుంచి కార్యకలాపాలు..
Also read: Vijayawada: సవతి తండ్రి నీచపు పని.. బాలిక స్నానం చేస్తుండగా సీక్రెట్‌గా వీడియో...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
AP capital: ఉగాది నుంచి ఏపీ రాజధానిగా విశాఖపట్నం!
రాజధాని మార్పుపై సీఎం జగన్ కీలక నిర్ణయం!
త్వరలోనే విశాఖపట్నానికి తరలింపు
నూతన జిల్లాలతో పాటే కొత్త రాజధానిలో పాలన!