Oh My Aadhya Song: ఓ మై ఆద్య అంటూ రష్మిక వెంటపడుతోన్న శర్వానంద్‌!

Aadavallu Meeku Joharlu Movie Songs: ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా నుంచి ఇది వరకే విడుదలైన పాట, టీజర్‌‌కు మంచి రెస్పాన్స్‌ రాగా.. తాజాగా రిలీజ్ అయిన ఓ మై ఆద్య సాంగ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 14, 2022, 08:26 PM IST
  • ఆడవాళ్లు మీకు జోహార్లు నుంచి మరో పాట రిలీజ్‌
  • వాలెంటైన్ డే సందర్భంగా ఓ మై ఆద్య అనే సాంగ్‌ విడుదల
  • సాంగ్‌లో శర్వానంద్‌, రష్మికల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది...
  • హాట్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటోన్న రష్మిక
Oh My Aadhya Song: ఓ మై ఆద్య అంటూ రష్మిక వెంటపడుతోన్న శర్వానంద్‌!

Oh My Aadhya Lyrical Song: శర్వానంద్‌, రష్మిక జంటగా తెరకెక్కిన మూవీ.. "ఆడవాళ్లు మీకు జోహార్లు". కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నె 25న రిలీజ్‌కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్‌ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఒక పాట, టీజర్‌ రిలీజ్‌ కాగా.. తాజాగా మరో పాటను మూవీ యూనిట్ రిలీజ్‌ చేసింది. 

వాలెంటైన్ డే సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి ఓ మై ఆద్య అనే సాంగ్‌ రిలీజ్‌ అయింది.  ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ అందించారు. ఫ్యామిలీ ఎంటర్‌‌టైన్‌మెంట్‌గా రూపొందిన ఈ మూవీ నుంచి హీరో ఆద్యని ఆరాధిస్తూ పాడే ఈ పాట ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్‌లో శర్వానంద్‌, రష్మికల మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. హాట్‌ లుక్స్‌తో నేషనల్ క్రష్‌.. రష్మిక ఆకట్టుకుంది. దేవీశ్రీ ప్రసాద్ మెలోడీ అదిరిపోయింది. సాంగ్‌కు తగ్గట్లుగా సింపుల్ స్టెప్స్‌తో క్రష్మిక దుమ్ములేపేసింది.

ఇక ఇటీవల రిలీజైన "ఆడవాళ్లు మీకు జోహార్లు" టీజర్‌కు..  టైటిల్‌ సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్‌ వచ్చిందో అంతకంటే ఎక్కువే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇక ఈ మూవీ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందటూ మూవీ యూనిట్ పేర్కొంది.

 

టైటిల్‌కు తగ్గట్లుగానే మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉన్న కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. చెరుకూరి సుధాకర్‌ నిర్మించిన ఈ మూవీలో ఖుష్బూ, ఊర్వశి, రాధిక  తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రవిశంకర్‌, వెన్నెల కిషోర్‌, ప్రదీప్‌ రావత్‌, సత్య తదితరులు ఈ మూవీలో నటించారు.

Also Read: AP Corona: ఏపీలో తగ్గుతున్న కొవిడ్ తీవ్రత- నైట్​ కర్ఫ్యూ ఎత్తేసిన ప్రభుత్వం

Also Read: Balayya Love Tips: అమ్మాయిని ఎలా పటాయించాలో చెప్పిన బాలయ్య!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News