కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే.. మీ ఉద్యోగాలు మీ ఇంటికే... : నిరుద్యోగ యువతకు రేవంత్ పిలుపు

Revanth Reddy on CM KCR: ఇంటికో ఉద్యోగం, రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి.. ఇలా ఇప్పటివరకూ కేసీఆర్ చాలా మోసాలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 10:30 PM IST
  • కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటనపై రేవంత్ స్పందన
  • నిరుద్యోగులను మోసం చేసే ప్లాన్ అంటూ విమర్శలు
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే.. మీ ఉద్యోగాలు మీ ఇంటికే... : నిరుద్యోగ యువతకు రేవంత్ పిలుపు

Revanth Reddy on CM KCR: కేసీఆర్ ఇప్పటివరకూ చెప్పిన అబద్దాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఆయన గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కుతారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎప్పుడూ తెలంగాణ సమాజాన్ని మోసం చేయాలనుకున్నా... అసెంబ్లీనే ఆయన వేదికగా చేసుకుంటారని విమర్శించారు. ఇప్పుడు కూడా నిరుద్యోగ యువతను మోసం చేసేందుకే ఉద్యోగ నోటిఫికేషన్లపై ప్రకటన చేశారన్నారు. గతంలో ఇదే అసెంబ్లీ వేదికగా 1 లక్షా 51 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.

ఇంటికో ఉద్యోగం, రైతు రుణమాఫీ, దళితులకు మూడెకరాల భూమి.. ఇలా ఇప్పటివరకూ కేసీఆర్ చాలా మోసాలు చేశారని ఆరోపించారు. నిరుద్యోగ యువత కేసీఆర్‌ను ఉద్యోగాల కోసం అడగవద్దని.. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితే మీ ఉద్యోగాలు మీ ఇంటికే వస్తాయని నిరుద్యోగులను ఉద్దేశించి పేర్కొన్నారు. డిసెంబర్‌ లోగా ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే ఏడాది 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు.

ఉద్యోగ నోటిఫికేషన్ల దరఖాస్తుకు నిరుద్యోగుల నుంచి ప్రభుత్వం ఎటువంటి రుసుం తీసుకోవద్దని రేవంత్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులు  పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు ప్రభుత్వమే ఉచిత కోచింగ్ ఇప్పించాలని డిమాండ్ చేశారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై రేవంత్ రియాక్షన్ :

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోయినా.. అక్కడ బీజేపీ అధికారంలోకి రాలేదన్నారు. తాజా ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవన్నారు. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తుచేశారు. 

Also Read: PM Modi on Election Results: హోలీ పండగ ముందే వచ్చింది.. ఈ ఎన్నికల ఫలితాలు 2024 రిజల్ట్స్‌ను కూడా తేల్చేశాయి.. 

Also Read: Election Results 2022: ముగిసిన ఐదురాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. భారతీయ జనతా పార్టీ ప్రభంజనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News