Etela Rajender Birthday: ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు...

CM KCR Birthday wishes to Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 07:46 PM IST
  • ఈటలకు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
  • ఈటలకు సీఎం కేసీఆర్ లేఖ
  • శామీర్‌పేట నివాసంలో ఈటల పుట్టినరోజు వేడుకలు
Etela Rajender Birthday: ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు...

CM KCR Birthday wishes to Etela Rajender: బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'శ్రీ ఈటల రాజేందర్ గారు.. మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.' అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఈటలకు లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

గతేడాది అనూహ్య పరిణామాల నడుమ ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల బీజేపీలో చేరడం.. హుజురాబాద్ ఉపఎన్నికలో ఆ పార్టీ తరుపున విజయం సాధించడం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్ఎస్, ఈటల మధ్య మాటల తూటాలు పేలాయి. కేసీఆర్‌పై ఈటల తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం కేసీఆర్ ఈటలకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ఇవాళ ఈటల రాజేందర్ పుట్టినరోజు సందర్భంగా శామీర్‌పేట్‌లోని ఆయన నివాసంలో వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు జరిపారు. బీజేపీ కార్యకర్తలు, ఈటల మద్దతుదారులు వేడుకల్లో పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ ఈటలకు శుభాకాంక్షలు తెలిపారు.
 

Also Read: Russia-Ukraine war: రష్యా దాడులకు వందల సంఖ్యలో ఉక్రెయిన్ చిన్నారులు బలి!

Also read: ఏడేళ్ల వయసులో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత ఆమెను చంపిన యువకుడు.. 101 సార్లు కత్తితో పొడిచి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News