Telangana Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్... రెగ్యులరైజేషన్‌కు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

Telangana Contract Employees: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 29, 2022, 05:47 PM IST
  • తెలంగాణలో కాంట్రాక్ట్ జాబ్స్ రెగ్యులరైజేషన్
  • అనుమతినిచ్చిన ఆర్థిక శాఖ
  • ప్రభుత్వ శాఖల నుంచి వివరాల కోరిన ఆర్థిక శాఖ
Telangana Contract Employees: కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్... రెగ్యులరైజేషన్‌కు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్

Telangana Contract Employees: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆర్థిక మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని అన్ని శాఖలను కోరుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపట్టనున్నారు. 

కొద్దిరోజుల క్రితం సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, వివిధ ప్రభుత్వ శాఖల్లో 80,039 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్‌లో మునిగిపోయారు. 

నిజానికి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై రాష్ట్రం ఏర్పడిన కొత్తలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మానవీయ దృక్పథంతో రెగ్యులరైజేషన్‌కు నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. గతేడాది డిసెంబర్ 7న దీనిపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం పూనుకుంది.

Also Read: Viral News: 74 ఏళ్ల ఈ ఆటో డ్రైవర్ ఇంగ్లీష్‌కి ఫిదా అవాల్సిందే... ఆ ఫ్లూయెన్సీ ఎలా వచ్చిందంటే.

Ravi Shastri: నేను ఐపీఎల్ వేలంలో ఉంటే.. 15 కోట్లకు అమ్ముడుపోయేవాడిని: టీమిండియా మాజీ కోచ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News