Telangana Student loses Rs 1 lakh to a Google Search: ఈ ప్రపంచంలో రోజురోజుకు టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. సైబర్ నేరగాళ్ల ఆగడాలు కూడా పెరిగిపోతున్నాయి. హ్యాకర్స్ టెక్నాలజీని మంచి కంటే ఎక్కువగా.. చెడుకే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ కేటుగాళ్లు అమాయకులను దారుణంగా మోసం చేసి కోట్లు కొల్లగొడుతున్నారు. గూగుల్‌లో దొరికే కస్టమర్ కేర్ నంబర్లకు కాల్ చేసినా.. హ్యాకర్స్ వదలడం లేదు. తాజాగా ఓ విద్యార్థి గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. విషయంలోకి వెళితే...
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సుంకరి సాగర్ విద్యార్థి. పార్ట్ టైం జాబ్ కోసం సాగర్ ఏప్రిల్ 5న గూగుల్‌లో సెర్చ్ చేశాడు. దాంతో అతడికి ఓ కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ కనపడింది. కాల్ చేసి జాబ్ డీటెయిల్స్ అడగ్గా.. వెబ్‌సైట్‌లో వివరాలను ఇచ్చాడు. ఆ తర్వాత అమెజాన్ ఆపరేషన్ సర్వీస్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి.. సాగర్ వాట్సాప్ నంబర్‌కు సైబర్ కేటుగాళ్లు ఓ మెసేజ్ పంపించారు.
మూడు టాస్కులు పూర్తి చేస్తే రూ.1.51 వేలు చెల్లిస్తామని సాగర్ వాట్సాప్‌లో మెసెజ్ ఉంది. ఇది నిజమే అని నమ్మిన సాగర్.. మూడు టాస్కులు పూర్తిచేసి ఆన్‌లైన్ ద్వారా మొత్తంగా రూ.99,232 చెల్లించాడు. మరో రూ.10 వేలు చెల్లిస్తే.. రూ.2 లక్షల కమీషన్ వస్తుందని సైబర్ నేరగాళ్లు మరో మెసేజ్ చేశారు. దాంతో సాగర్‌కి అనుమానం వచ్చింది. చివరకు తాను మోసపోయానని గ్రహించిన సాగర్ సాగర్.. విషయాన్ని కుటుంబ సబ్యులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న వారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవలి కాలంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువుగా వస్తున్నాయని గతంలోనే పోలీసులు తెలిపారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు విద్యార్థులను టార్గెట్ చేసి మరీ మోసం చేస్తున్నారు. మరోవైపు బ్యాంక్ నుంచి కూడా కాల్ చేస్తున్నామని చెప్పి వివరాలు అడిగి మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. నిత్యం ఏదోచోట ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎవరితోనూ మన డీటెయిల్స్ పంచుకోకపోవడమే ఉత్తమ మార్గం.
Also Read: Dog Losses 1.5 lakh: కుక్క వల్ల యజమానికి రూ. లక్ష 50 వేలు నష్టం.. ఏమిటా కథ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.