Friday Remedies: వారంలో ప్రతి శుక్రవారం హిందూమతంలోని కొంతమంది దేవతలకు, దేవుళ్లకు అంకితం చేసినట్లు భక్తుల విశ్వాసం. శుక్రవారం రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని పూజిస్తే మేలు జరుగుతుందని ప్రజల నమ్మకం. ఈ క్రమంలో శుక్రవారం లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద లభిస్తాయని మత గ్రంథాలు చెబుతున్నాయి. లక్ష్మీ దేవి అనుగ్రహం పొందేందుకు శుక్రవారం నాడు పూజలు, ఉపవాసాలు చేస్తే మేలు.
మత విశ్వాసాల ప్రకారం.. శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువును సమర్పించడం ద్వారా ఆమె అనుగ్రహం పొందవచ్చు. ఆమెకు చేసుకునే పూజలకు తరించి భక్తులను ఆశీర్వదిస్తుంది. అయితే శుక్రవారం లక్ష్మీదేవికి ఎలాంటి వస్తువులు సమర్పించవచ్చో తెలుసుకోండి.
1. పాయసం
హిందూ మత గ్రంధాల ప్రకారం, సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి తెలుపు రంగు వస్తువులు ప్రీతికరమైనవి. దీంతో పాటు పాలతో తయారు చేసిన ఉత్పత్తులు చాలా ప్రియమైనవి. అందుకే, శుక్రవారం నాడు పాలతో పాయసం, పంచదారతో చేసిన స్వీట్స్ ను ప్రసాదంగా సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహం పొందేందుకు అవకాశం ఉంది.
2. తామర పువ్వులు
లక్ష్మీ దేవికి తామర పువ్వులను కూడా సమర్పించవచ్చు. తామరపువ్వు గింజల నుంచి మఖానాలు తయారవుతాయని చెబుతారు. అందుకే దీనిని ఫూల్ మఖానా అని కూడా అంటారు. లక్ష్మీ దేవికి చేసే పూజలో ఇవి సమర్పించడం వల్ల ఆ పూజ ప్రత్యేకం అవుతుంది.
శుక్రవారం రోజు చేయాల్సిన పరిహారాలు..
- శుక్రవారం లక్ష్మీ దేవత అనుగ్రహం పొందేందుకు 'ఓం శ్రీం శ్రీయే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
- లక్ష్మి మాత శ్రీ మహా విష్ణువు భార్య అని నమ్ముతారు. ఈ క్రమంలో శుక్రవారం నాడు శంఖంలో నీరు నింపి విష్ణువును పూజిస్తే లక్ష్మీ దేవి సంతోషిస్తుంది.
- శుక్రవారం నాడు లక్ష్మీ దేవి ముందు నెయ్యి దీపం వెలిగించి, దీపంలో కొంచెం కుంకుమ పెడితే శుభం కలుగుతుంది.
(నోట్: పైన పేర్కొన్న సమాచారమంతా టిప్స్, నివారణ చర్యల నుంచి గ్రహించబడింది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Thursday Tips: గురువారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు ఈ పనులు చేయకూడదు!
Also Read: Tuesday Remedies: హనుమంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు మంగళవారం ఈ పనులు చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook