The Real Test Begins For Naga Chaitanya: అక్కినేని హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తాత, తండ్రి నుంచి నట వారసత్వం అందుకుని దాన్ని విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. జోష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య ఆ సినిమాతో హిట్ అందుకోలేకపోయాడు. అయితే ఆ తర్వాత సమంత హీరోయిన్ గా చేసిన ఏం మాయ చేసావే సినిమాతో ఆయన సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని అయితే పడలేదు. అయితే ఆయన చేస్తున్న అన్ని సినిమాలకు మినిమమ్ మార్కెట్ ఏర్పడడంతో వరుస సినిమా అవకాశాలు దక్కాయి.
ఆయన సుదీర్ఘ కెరీర్ లో 100% లవ్, దడ, బెజవాడ, తడాఖా, మనం, ఆటోనగర్ సూర్య, ఒక లైలా కోసం, దోచేయ్, ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో, రారండోయ్ వేడుక చూద్దాం, యుద్ధం శరణం, శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి, మజిలీ, వెంకీ మామ, లవ్ స్టోరీ, బంగార్రాజు, లాంటి సినిమా చేయగా చాలా వరకు హిట్స్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు నాగచైతన్య గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదేమంటే ఆయన కెరీర్ లో మంచి హిట్స్ అనుకున్న సినిమాలు అన్నిటికీ మంచి బ్యాకప్ ఉందని అంటున్నారు. అంటే మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ కానీ మల్టీస్టారర్ అవడం కానీ జరిగిందని అంటున్నారు. ఉదాహరణకు మజిలీ సినిమాతో ఆయన హిట్ అందుకున్నా ఆ హిట్ లో సింహభాగం సమంతకు దక్కుతుంది.
ఇక ఆ తర్వాత ఆయన చేసిన వెంకీ మామ సినిమా కూడా హిట్ అయింది కానీ అది మల్టీస్టారర్ కావడంతో అందులో కూడా ఆయన షేర్ కొంతవరకే. అంతేకాక లవ్ స్టోరీ సినిమాలో కూడా సాయి పల్లవి క్రేజ్ నాగచైతన్యను డామినేట్ చేసింది. ఆ సినిమా హిట్ అయినా కూడా నాగచైతన్యది చిన్న పాత్రే ఇక బంగార్రాజు పరిస్థితి కూడా అంతే ఒక పక్క మల్టీస్టారర్ కావడమే కాక మంచి క్రేజ్ ఉన్న కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవడం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. దీంతో ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఎట్టకేలకు ఆయన స్టామినా ఏంటో తెలిసి రావడానికి అవకాశం ఏర్పడింది.
ఎందుకంటే ఆయన హీరోగా నటించిన థాంక్యూ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకు పెద్దగా క్రేజ్ లేదు. ఇక దర్శకుడు విక్రమ్ కుమార్ కూడా హిట్ కొట్టి చాలా రోజులు అయింది. దీంతో ఈ సినిమా బరువు బాద్యతలు అన్నీ ఇప్పుడు నాగచైతన్య భుజానే ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన ఈ సినిమాతో హిట్ అందుకుంటే ఆయన సత్తా ఏమిటి అని టాలీవుడ్ కు చాటి చెప్పినట్టు అవుతుంది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా కనుక తేడా పడితే నాగచైతన్య మళ్ళీ బ్యాకప్ కోసం చూసుకోక తప్పదు. అది ఆయన ఇమేజ్ కు అంత మంచిది కాదనే చెప్పాలి. ఒకరకంగా నాగచైతన్య (Naga chaitanya) స్వయంగా హిట్ కొట్టే సత్తా లేదనే మరక తప్పదు అనే చెప్పాలి.
Read Also : Sukumar : ఇదేందయ్యా ఇదీ.. ఇట్టా అయితే ఎట్టా.. బెంగ పెట్టుకున్న బన్నీ ఫ్యాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook