Kuppam Babu Tour: చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ టెన్షన్ కనిపిస్తోంది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రెండో రోజు టూర్‌ను అడ్డుకుంటామని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది. ఈక్రమంలో బంద్‌కు పిలుపునిచ్చింది. నగరంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. చంద్రబాబు ప్రారంభించనున్న అన్న క్యాంటీన్‌ను సైతం తొలగించారు. దీంతో ఇరుపార్టీల నేతలు ఘర్షణకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగారు.
ఇప్పటికే స్వచ్ఛందంగా స్కూళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. కుప్పం పరిధిలోని ఆర్టీసీ బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇరుపార్టీల బల ప్రదర్శనతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. పలుచోట్ల బారికేడ్లను అమర్చారు. బంద్‌ను సక్సెస్ చేస్తామని వైసీపీ చెబుతోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు టూర్‌ను సక్సెస్ చేస్తామని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.