Anasuya Warns Netizens: 'ఆంటీ' అంటే చుక్కలు చూపిస్తా.. స్క్రీన్ షాట్లు దాస్తున్నా అంటూ అనసూయ వార్నింగ్!

Anasuya Bharadwaj Warns People Who Commenting Her as Aunty: తనను ఆంటీ అంటున్న వారందరికే యాంకర్ అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఆ వివరాలు

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 26, 2022, 01:58 PM IST
Anasuya Warns Netizens: 'ఆంటీ' అంటే చుక్కలు చూపిస్తా.. స్క్రీన్ షాట్లు దాస్తున్నా అంటూ అనసూయ వార్నింగ్!

Anasuya Bharadwaj Warns People Who Commenting Her as Aunty: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు కర్మ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా అంటూ అనసూయ చేసిన ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఆమె మీద బూతులతో రెచ్చిపోతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ తనను ఎవరైతే అసభ్యంగా దూషిస్తున్నారో  మీ దూషణలు అన్నీ మీ అభిమాన హీరో, హీరోలకు మళ్లిస్తున్నానని మీరు దూషిస్తున్నారు అంటే అది మీ సమస్య, మీ ఖరాబైన బుర్రల నుంచి అవి వస్తున్నాయి కాబట్టి అది మీ సమస్య మాత్రమే, నా సమస్య కాదంటూ ఆమె ట్వీట్ చేశారు.

ఇక ఆ తరువాత ఏమనుకుందో ఏమో కానీ ఈ రోజు చి చి అసలు ఎంత చెత్త బాబోయ్, క్లీన్ చేసి చేసి విసుగొస్తుంది అంటూ తాను చేసిన ట్వీట్ గురించి చేస్తున్న నెగిటివ్ కామెంట్స్ గురించి ఆమె కామెంట్ చేసింది. తర్వాత తాను తనను ఆంటీ అని ఏజ్ షేమింగ్ చేస్తున్న వారిని, అలాగే తనను దూషిస్తున్న వారి ప్రతి స్క్రీన్ షాట్ తీసుకుంటున్నానని నా కుటుంబాన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్న వారి స్క్రీన్ షాట్లను తీసి వారి మీద పోలీస్ కేసు పెడతానని ఆమె పేర్కొన్నారు. అది ఎక్కడ వరకు వెళుతుంది అంటే ఎందుకు నన్ను ఇలా మాట్లాడానా అని వాళ్ళు బాధపడే రేంజ్ కి తీసుకెళ్తానని ఆమె హెచ్చరించింది.

ఇదే తన ఫైనల్ వార్నింగ్ అంటూ కూడా ఆమె వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు తనను బూతులతో రెచ్చిపోయి తిడుతున్న వారి ప్రతి ట్వీట్ రీ ట్వీట్ చేస్తారని తాను పిరికిదాన్ని కాదని తాను ఎందుకింత బాధపడుతున్నాను అనేది ఆ ట్వీట్లు అందరికీ అర్థమయ్యే విధంగా రీట్వీట్ చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ రాయడానికి కూడా వీలులేని విధంగా ఉన్న కొన్ని బూతులను ఆమె రీట్వీట్ చేసింది.  ఆంటీని ఆంటీ అనకుండా ఏ అమ్మాయి అంటారా ఏంటి అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా నేను మీకు ఆంటీ ఎందుకు అవుతానండి మీ అబ్యూజర్స్ భాషలో చెప్పాలంటే మీ ఇంట్లో వాళ్లకి మా ఇంట్లో వాళ్లకి ఎలాంటి రిలేషన్ లేనప్పుడు అంటూ ఆమె కౌంటర్ ఇచ్చింది.

ఇక జబర్దస్త్ లో వేసి డబల్ మీనింగ్ జోకులకి నవ్వుతున్నావ్ దానికి మేడమ్ అని పిలవాలా అంటూ ఒక నెటిజెన్ ట్వీట్ చేయగా మీకు అంత ధైర్యం ఉంటే షో చేసే వాళ్ల మీద పడండి, చూస్తున్న వాళ్ళ మీద పడండి, తప్పుని తప్పు అని చెప్పే నా మీద పడటం మీ చేతకాని తనం అయినా మూవీలో వాడితే హీరో టీవీలో వాడితే చీపా? ఎవరిది హిప్పోక్రసీ అంటూ ఆమె ప్రశ్నించింది. దానికి ఒక యూజర్ ఏంటి ఆంటీ ? అంటే కూడా కేసు పెట్టొచ్చా ? అంటే అవును తప్పకుండా పెట్టొచ్చు ఒక స్త్రీని పదాలతో ఇబ్బందికరంగా మాట్లాడితే కేసు పెట్టచ్చు అని ఆమె పేర్కొన్నారు.

మరొక యూజర్ నాది కూడా రీట్వీట్ చేయి నాకు రీచ్ వస్తది అంటే ఎలాంటి రీచ్ కావాలి బాబు మీకు? ఏంటండీ మీ లక్ష్యం? ఇంతేనా ఏం బతుకులు మీవి? ఇదిగో చేసేసా చూడు అంటూ ఆమె పేర్కొంది. మరో నెటిజన్ అసలు మీరు ఈ ట్వీట్లు గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు? అసలు వేరే సెలబ్రిటీలు ఏమీ పట్టించుకోనప్పుడు మీరు ఎంత ఎందుకు హడావిడి చేస్తున్నారు? అంటే నేను నా ఫాలోయింగ్ పడిపోతుంది ఏమో అనే ఉద్దేశంతో వెనకడుగు వేయను, నన్ను నన్నుగా జన్యున్గా ఇష్టపడే వారి కోసమే నేను బతుకుతున్నాను అంటూ అనసూయ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Liger Movie Collections: డిజాస్టర్ టాక్ తో కూడా దుమ్ము రేపిన లైగర్ మూవీ.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

Also Read: Dasara Movie Release Date: సిల్క్ స్మిత సాక్షిగా 'దసరా' రిలీజ్ డేట్ చెప్పేసిన నాని

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News