మీ కులం ఏమిటి ? మీరు చేస్తున్న ఉద్యోగం ఏమిటి? మీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? ఇలాంటి వివరాలు ఇస్తే చాలు. ఆ వెబ్ సైటు చిటికెలో మీకు కావాల్సిన సమాచారాన్ని ఇచ్చేస్తుంది. మీరు ఎంత కట్నం తీసుకోవడానికి అర్హులో లెక్క కట్టి మరీ చెబుతుంది. ఆ వెబ్ సైట్ పేరే డౌరీకాలిక్యులేటర్.కామ్. అయితే ప్రారంభించిన కొద్ది రోజులకు ఈ సైట్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నెటిజన్లు.
పెళ్లికొడుకులు ఏమైనా సంతలో దొరికే పశువులా.. రేటు ఫిక్స్ చేయడానికి? అని ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. వరుడి కులంతో పాటు చేసే ఉద్యోగం, ఎత్తు, రంగు మొదలైన వివరాలు ఇస్తే చాలు.. ఆ సైటు ఆయా వరుడికి ఎలాంటి అమ్మాయి అవసరమో.. ఆమె ఎంత కట్నం తీసుకొచ్చే అవకాశం ఉందో ఇట్టే చెప్పేస్తోంది. ఉదాహరణకు.. 27 ఏళ్ల బ్రాహ్మణ యువకుడు నెలకు 2 లక్షల రూపాయలు సంపాదిస్తే.. అతను కనీసం రూ.1 కోటి తీసుకోవడానికి అర్హుడేనని మొహమాటం లేకుండా చెప్పేస్తుంది ఈ సైటు.
ఇటీవలే ఈ సైటును బ్యాన్ చేయాలని.. భారతదేశంలో బ్లాక్ చేయాలని ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వానికి తెలిపారు. ప్రధాన మంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారు. ఆ సైటు నిర్వాహకులను సిగ్గుమాలిన వారిగా పేర్కొన్నారు. ఈ సైటును డెవలప్ చేసే వారికి భారతదేశంలో కట్నం తీసుకోవడం నేరం అని తెలియదా అని కూడా ప్రశ్నించారు. ఈ విషయం ఇప్పటికే ఐటి శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ వద్దకు వెళ్లింది. మరి ఈ సైటును బ్యాన్ చేస్తారో లేదో వేచి చూడాల్సిందే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం భారతదేశంలో వరకట్న వేధింపులకు గురై మరణించిన అతివల శాతం యూపీలో అత్యధికంగా 9.5% గా నమోదైంది. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్ (8.9%), మహారాష్ట్ర (8.8%), కేరళ (8.7%) ఉన్నాయి.
Someone just brought this site to my attention. Absolutely shameful! Let me remind the developers that giving or taking dowry is illegal in India. I urge the @MinistryWCD, @PMOIndia to take immediate action against this.https://t.co/KQWBxQtd7J
— Jyotiraditya Scindia (@JM_Scindia) May 28, 2018
ఈ సైటులో వరుడి రేటు ఫిక్స్ చేస్తారు