Telangana CM KCR to visits Yadadri Thermal Power Plant Today: సోమవారం ఉదయం నల్గొండ జిల్లా దామరచర్లలో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. దామరచర్లలో నిర్మితమవుతున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పర్యవేక్షించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయంకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 12 గంటలకు దామరచర్లకు చేరుకుంటారు. అక్కడి థర్మల్ పవర్ ప్లాంట్ పనుల పురోగతిని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సహా ఉన్నతాధికారులతో కలిసి సీఎం పరిశీలించనున్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పర్యవేక్షించచిన అనంతరం అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం సీఎం హెలికాప్టర్లో హైదరాబాద్ చేరుకుంటారు. దామరచర్లలో రూ. 29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా 5 యూనిట్లను నిర్మిస్తున్నారు. 2023 సెప్టెంబర్ నాటికి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభించేలా కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే వేగంగా పనులు పూర్తిచేస్తున్నారు. ఇది దేశంలో ప్రభుత్వ రంగంలో నిర్మిస్తున్న అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మొదటిది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో థర్మల్ విద్యుత్ కేంద్రమే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్. కొత్తగూడెంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త ప్లాంటును 48 నెలల్లో నిర్మించి విద్యుదుత్పత్తిని జెన్కో ప్రారంభించింది. ఆ తర్వాత భద్రాద్రి జిల్లా ఏడూళ్ల బయ్యారం వద్ద 1080 మెగావాట్ల సామర్థ్యంతో రెండో ప్లాంటును ప్రారంభించింది. మూడో ప్లాంటు యాదాద్రి పేరుతో దామెరచర్ల వద్ద చేపట్టింది. యాదాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో కరెంటు కొరత ఉండదు.
Also Read: అదేపనిగా టీవీ చూస్తున్నాడని.. కుమారుడికి పేరెంట్స్ కఠిన శిక్ష! అచ్చు సినిమా మాదిరే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.