Bad Cholesterol Remedies: రక్తంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య.. ? రూ. 24తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు!

Bad Cholesterol Remedies: ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్ అనేది ప్రధాన సమస్యగా మారింది. ఒక్క కొలెస్ట్రాల్ కారణంగా శరీరంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో ఎప్పటికప్పుుడు అప్రమత్తంగా ఉండాలి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 19, 2023, 09:56 PM IST
Bad Cholesterol Remedies: రక్తంలో చెడు కొలెస్ట్రాల్ సమస్య.. ? రూ. 24తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు!

Bad Cholesterol Reducing Tips and Precautions: కొలెస్ట్రాల్ చాలా ప్రమాదకరమైంది. రక్తంలో పేరుకుపోయుండే కొలెస్ట్రాల్ కారణంగా డయాబెటిస్, రక్తపోటు, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులు తలెత్తుతాయి. అయితే కొలెస్ట్రాల్ నియంత్రణ మాత్రం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. 

కొలెస్ట్రాల్ అనేది మైనం వంటి పదార్ధం. ఇది మోతాదు మించితే రక్త నాళికల్ని బ్లాక్ చేస్తుంది. ఫలితంగా గుండె వ్యాధులకు కారణమౌతుంది. హార్ట్ ఎటాక్, హాల్ట్ స్ట్రోక్ వంటి సమస్యలకు ప్రధానమైన కారణం కొలెస్ట్రాల్ అని చాలామంది వైద్యులు చెబుతుంటారు. కొలెస్ట్రాల్ రక్త నాళికల్లో పేరుకుపోవడం వల్ల రక్త సరఫరాను నిలిపివేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి అత్యంత హానికరం. అందుకే ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం, అవసరమైనప్పుడు నియంత్రించడం చేస్తుండాలి. 

కొలెస్ట్రాల్ విషయంలో చాలా అప్రమత్తత అవసరం. చాలామందికి దీనిపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. కొలెస్ట్రాల్ తగ్గించే విధానాలను అణ్వేషిస్తుంటారు. ఎలాంటి పదార్ధాలు తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందనేది తెలుసుకోవాలి. కొలెస్ట్రాల్ తగ్గించాలంటే డైట్‌లో మార్పులు అవసరం. దాంతోపాటు వ్యాయామం కూడా చేయాలి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయి డెసిలీటర్‌కు 70 మిల్లీగ్రాముల కంటే దిగువకు ఉండాలి. అటు హెచ్‌డిఎల్ డెసిలీటర్‌కు 40 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండాలి. ఎథెరోస్కెలేరోసిస్, గుండెపోటు ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. 

హార్వర్డ్ హెల్త్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం..కొలెస్ట్రాల్ తగ్గించేందుకు 5 రకాల మందులున్నాయి. ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందేందుకు స్టాటిన్ మెడిసిన్ అద్భుతంగా పనిచేస్తుంది. 10 ట్యాబ్లెట్ల ధర 24 రూపాయలుంటుంది. అంటే ఒక్కొక్క ట్యాబ్లెట్ 2.5 రూపాయలు. ఈ మందుల ద్వారా కొలెస్ట్రాల్ అద్భుతంగా తగ్గించవచ్చు.

Also read: High Cholesterol: ఈ చిన్న 3 చిట్కాలతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ వెన్నలా కరగడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News