Allu Arjun Vs NTR: రామ్ చరణ్, చిరంజీవి కంటే NTR ఎక్కువయ్యాడా..? కొత్త వివాదానికి కారణమవుతున్న 'బావ'..?

Allu Arjun Reply to Ram Charan Tweet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సంధర్భంగా అనేక మంది హీరోలు ఆయనకు విష్ చేయగా రామ్ చరణ్, చిరంజీవి కంటే ముందు ఎన్టీఆర్ కు ఆయన విషెస్ అందించిన అంశం హాట్ టాపిక్ అవుతోంది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 11, 2023, 07:05 PM IST
Allu Arjun Vs NTR: రామ్ చరణ్, చిరంజీవి కంటే NTR ఎక్కువయ్యాడా..? కొత్త వివాదానికి కారణమవుతున్న 'బావ'..?

Funny 'Bava' Conversation Between Allu Arjun and NTR: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న ఘనంగా పుట్టినరోజు జరుపుకున్నారు. పుష్ప పాన్ ఇండియా హిట్టుతో మంచి జోష్ మీద ఉన్న ఆయనకు పాన్ ఇండియా రేంజ్ లోనే విషెస్ వచ్చాయి. తన అభిమానులతో పాటు సాటి స్టార్ హీరోలు సైతం అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువలా కురిపించారు. ఒకపక్క అభిమానులకు పుష్ప సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్లు రెండు ఇచ్చేయడంతో వారు హ్యాపీగా ఎంజాయ్ చేసిన పరిస్థితి కనిపించింది.

అయితే ప్రతి పుట్టినరోజు లానే నిన్న కూడా ట్విట్టర్లో తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన సెలబ్రిటీలకు అల్లు అర్జున్ తిరిగి థాంక్స్ చెప్పే ప్రయత్నం చేశాడు. అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. నిజానికి తెలుగు సినీ పరిశ్రమ నుంచి అనేక మంది హీరోలు, హీరోయిన్లు అల్లు అర్జున్ కి విషెష్ చెప్పారు. ఆయన కూడా చాలా మందికి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్లు చేశాడు. అయితే అల్లు అర్జున్ అందరికీ చెప్పిన థాంక్స్ కంటే ఎన్టీఆర్ కి చెప్పిన థాంక్స్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి ఎన్టీఆర్, అల్లు అర్జున్ ని విష్ చేయడం కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా విష్ చేశారు.

Also Read: Nandita Swetha Sizzling: టైట్ ఫిట్ డ్రెస్సులో నందితా శ్వేతా.. భారీ అందాలతో హాట్ ట్రీట్

కానీ వారి కంటే ముందు ఎన్టీఆర్ కు అల్లు అర్జున్ థాంక్స్ చెప్పాడు. ముందుగా ఎన్టీఆర్ వెరీ హ్యాపీ బర్త్డే బావ అంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబితే థాంక్స్ బావ నీకు నా హగ్గులు అని అర్థం వచ్చేలా అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. దానికి ఎన్టీఆర్ కూడా సరదాగా ఓన్లీ హగ్స్ ఏనా? పార్టీ లేదా పుష్ప అని కామెంట్ చేశాడు. దీంతో వెంటనే అల్లు అర్జున్ వస్తున్నా అంటూ పార్టీ ఇవ్వడానికి ఎన్టీఆర్ దగ్గరికి బయలుదేరుతున్నట్లు ట్వీట్ చేశాడు. ఇదంతా ఇప్పుడు రామ్ చరణ్ సహా మెగా అభిమానులను బాధిస్తోంది.

ఎందుకంటే రామ్ చరణ్ తేజ్, అల్లు అర్జున్ కి బావ అవుతాడు. ఎన్టీఆర్ కొసరు బావ అవుతాడు అంటే కేవలం పిలుపు మాత్రమే బావ అని ఉంటుంది. అలాంటిది రామ్ చరణ్ కు చిరంజీవికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వాళ్లకి థాంక్స్ చెప్పడం కంటే ముందుగా ఎన్టీఆర్ కి థాంక్స్ చెప్పడం ఏమాత్రం బాలేదని కొంతమంది మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ ను కూడా పనిలో పనిగా ట్రోల్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ బావ అనే పదం కొత్త చిచ్చు పెట్టేలా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ కి థాంక్స్ చెప్పిన కొన్ని నిమిషాల్లోనే థాంక్స్ బ్రదర్ అంటూ రామ్ చరణ్ కు కూడా అల్లు అర్జున్ థాంక్స్ చెప్పారు. అయినా సరే ఎందుకు ఈ బావ అనే పదం రాలేదు అని ప్రశ్నిస్తున్నారు మెగా ఫాన్స్. ఈ అంశంలో మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి.

Also Read: Debut 100 Crores Filims: సౌత్లో మొదటి సినిమాతోనే 100 కోట్లు కొట్టిన డైరెక్టర్లు..ఇద్దరు సుకుమార్ శిష్యులే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x