Python Viral Video: వీడియో చూస్తే గుండెలు గుభేల్.. లేడీస్ హస్టల్‌లో 17 అడుగుల భారీ కొండ చిలువ.. ఎలా వచ్చిందంటే..?

17 Foot python found in assam video: భారీ కొండ చిలువ ప్రస్తుతం అస్సాంలో హల్ చల్  చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారుల సహాయంలో దాన్ని బంధించి అడవిలో వదిలేసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Dec 24, 2024, 04:26 PM IST
  • అస్సాంలో కొండ చిలువ హల్ చల్..
  • షాక్ కు గురౌతున్న నెటిజన్లు..
Python Viral Video: వీడియో చూస్తే గుండెలు గుభేల్.. లేడీస్ హస్టల్‌లో 17 అడుగుల భారీ కొండ చిలువ.. ఎలా వచ్చిందంటే..?

17 foot big python viral video: అడవుల్లో, చెట్లు భారీగా ఉన్న ప్రదేశాల్లో పాములు, కొండ చిలువలు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ఇటీవల కాలంలో పాములు, భారీ కొండ చిలువల వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. నెటిజన్లు సైతం పాముల వీడియోలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. అసలు.. పాములు కన్పిస్తే.. చాలా మంది పాముల్ని పట్టేవాళ్లకు వెంటనే సమాచారం ఇస్తారు.  

అదే విధంగా పాము ఎక్కడుందో అని ఒక కంట కనిపెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అడవులు, దట్టమైన చెట్లకు దగ్గరగా ఉన్న పరిసరాల్లో పాములు ఎక్కువగా వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక భారీ కొండ చిలువ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు.

 

పామును చూస్తేనే భయంతో పారిపోతారు. అలాంటిది  భారీ కొండ చిలువ.. అది కూడా.. 17అడుగుల భారీ కొండ చిలువ బైట పడితే.. ఇంకేమైన ఉందా.. అచ్చం ఇలాంటి ఘటన అస్సాంలోని సిల్చార్ లో చోటు చేసుకుంది. సిల్చార్ లో బాలికల హస్టల్ కు సమీపంలో భారీ కొండ చిలువ దర్శనం ఇచ్చింది.

దీంతో అక్కడి అమ్మాయిలు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే అక్కడున్న సిబ్బంది.. ఆర్మీ వారికి సమాచారం ఇచ్చారు. ఆ కొండ చిలువు దాదాపు.. 17 అడుగుల పొడవు, 100 కేజీల బరువుందంట.

Read more: Cobra Snake Video: స్నేక్ క్యాచర్‌కు సుస్సు పోయించిన కింగ్ కోబ్రా.. షాకింగ్ వీడియో వైరల్..

అక్కడి అధికారులు ఎంతో కష్టపడి.. ఆ కొండ చిలువును బంధించినట్లు తెలుస్తొంది.  ఆతర్వాత దాన్ని దగ్గరలోని అడవిలోకి వదిలేసి వచ్చారంట.  బర్మీస్ జాతీకి చెందిన కొండ చిలువని అధికారులు చెప్తున్నారు. ఇది చాలా బరువు, పొడవు ఉంటాయంట.   ఈ వీడియో ప్రస్తుతంసోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారంట.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News