సింగర్‌పై పోటాపోటీగా లక్షల రూపాయల నోట్లు వెదజల్లిన ఎమ్మెల్యేలు

గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఓ సింగర్‌పై నోట్ల వర్షం కురిపించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. 

Last Updated : Mar 27, 2018, 02:20 PM IST
సింగర్‌పై పోటాపోటీగా లక్షల రూపాయల నోట్లు వెదజల్లిన ఎమ్మెల్యేలు

గుజరాత్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఓ సింగర్‌పై నోట్ల వర్షం కురిపించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. అది కూడా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.25 లక్షల రూపాయల మొత్తం తమ సరదా కోసం ఆ సింగర్‌పై వెదజల్లినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబరీష్‌ ధర్, బీజేపీ ఎమ్మెల్యే పూనమ్‌బెన్‌ మాదమ్‌ ఇద్దరూ తమ అనుచరులతో కలిసి గిర్‌ సోమ్‌నాథ్‌ పట్టణంలో తాజాగా ఓ సంగీత కచేరికి హాజరయ్యారు. అక్కడ ఫోక్ సింగర్‌ కీర్తిదన్‌ గధ్వి వేదికపై ప్రదర్శన ఇస్తుండగానే ఈ ఇద్దరూ ఒకరికి మరొకరు నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా ఆ సింగర్‌‌పై నోట్లను కుప్పలుతెప్పలుగా వెదజల్లారు. ఇద్దరు ఎమ్మెల్యేలు సింగర్‌పై వెదజల్లిన మొత్తం లెక్కించగా రూ.25 లక్షల వరకు వున్నట్టు తెలుస్తోంది.

వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి ->   http://zeenews.india.com/hindi/videos/gujarat-cash-rain-by-mp-and-mla-in-a-program-in-somnath/383638

ఇక ఈ ఇద్దరు ఎమ్మెల్యేలో ఒకరైన అంబరీష్ ధర్‌తోపాటు మరో ఎమ్మెల్యే ప్రతాప్‌ దుధత్‌ను ఇటీవలే గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ మూడేళ్లపాటు సస్పెండ్ చేశారు. బీజేపీ నేతపై మైక్రోఫోన్‌తో దాడికి పాల్పడి, సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించినందుకు అక్కడి స్పీకర్ వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇదిలా వుండగా ఇప్పుడిలా సింగర్‌పై లక్షల రూపాయల విలువైన నోట్లు వెదజల్లి మళ్లీ వార్తల్లోకెక్కారు అంబరీష్ ధర్. 

Trending News