Viral Video: ఇదేం పైత్యంరా బాబు.. బస్సులో బూతులు తిట్టుకుంటూ, చెప్పులతో కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ వీడియో..

Karnataka Bus: బస్సులో ఇద్దరు యువతులు బూతులు తిట్టుకుంటూ చెప్పులతో కొట్టుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్ లు ఎంతగా చెప్పిన కూడా అస్సలు పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 8, 2024, 08:32 PM IST
  • - వామ్మో.. బస్సులో అమ్మాయిల బూతు పురాణం..
    - షాక్ తో చెతులెత్తెసిన ప్యాసింజర్లు..
 Viral Video: ఇదేం పైత్యంరా బాబు.. బస్సులో బూతులు తిట్టుకుంటూ,  చెప్పులతో  కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ వీడియో..

Girls Fight For Mirror In BMTC Bus :  ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఈ క్రమంలోనే మహిళలు పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో బస్సులలో రద్దీ కూడా భారీగా ఉంటుంది. ఎన్ని బస్సులు  అరెంజ్ చేసిన కూడా రద్దీని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. అయితే.. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి తరచుగా మహిళలు గొడవలు పడిన ఘటనలు వైరల్ గా మారుతున్నాయి.

 

 

కొన్నిసార్లు, సీటు విషయంలో, మరికొన్ని సార్లు ఆధార్ కార్డు చూపించలేదనే కారణాలతో రచ్చ జరుగుతుంది. చాలా చోట్ల మహిళలు సీట్లు కోసం బస్సులో జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు. మహిళలు జుట్టుపట్లుకుని కొట్టుకొవడం, బస్సులు నానా రచ్చలు చేయడం వంటివి అనేక వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.

ఇవి ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణఅవకాశం ఉన్న కర్ణాటక, తెలంగాణలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. అచ్చం ఇలాంటి మరో యువతుల మధ్య జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ర గా మారింది. కర్ణాటకలోని లోని బెంగళూరు బీఎంటీసీ బస్సులో  ఈ ఘటన జరిగింది. డ్రైవర్ వెనుక సీటు యువతులకు, ఆమె వెనుక ఉన్న యువతులకు మిర్రర్ విషయంలో గొడవ జరిగింది. దీంతో బూతులు తిట్టుకున్నారు.

Read More: Disha Patani: హాట్ హాట్ ఫోజులతో రెచ్చిపోయిన లోఫర్ బ్యూటీ, బోల్డ్ పిక్స్ వైరల్

ఆ తర్వాత మరో అడుగు ముందుకు వేసి, చెప్పులు తీసి  టపా టపా కొట్టుకున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ ఆపడానికి ప్రయత్నించిన కూడా ఎవరు వెనక్కు తగ్గడంలేదు.  బస్సులో ఉన్న ప్యాసింజర్లు ఈ ఘటనను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఇదేంపైత్యం .. ప్రజెంట్ ట్రెండ్ ఇదేనా.. అంటూ సెటైరిక్ గా కామెంట్లు పెడుతున్నారు. 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News