Viral Video: బాబోయ్.. నీకు పెద్ద దండం తల్లో.. నాగుపాములకు తలంటు పోస్తున్న మహిళ.. వీడియో వైరల్..

Snake Video: మహిళ తన ఇంటి నిండా పాముల్ని పెట్టుకుంది. మరీ ఆమె పాముల్ని పెంచుకుంటుందో ఏంటోకానీ.. వాటికి స్నానంసైతం చేయిస్తుంది. ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని పాముల్ని తీసుకుని అదేదో బట్టల్ని ముంచి తీసినట్లు పాముల్ని గిన్నెలో ముంచి బైటకు తీస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 3, 2024, 08:28 PM IST
  • పాములకు స్నానం పొస్తున్న మహిళ..
  • షాక్ అవుతున్న నెటిజన్ లు..
Viral Video: బాబోయ్.. నీకు పెద్ద దండం తల్లో..  నాగుపాములకు తలంటు పోస్తున్న మహిళ.. వీడియో వైరల్..

woman gives bath to venomous cobra video: ఇటీవల కాలంలో పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. చాలా మంది పాముల్ని చూడగానే అరకిలో మీటర్ దూరం పారిపోతారు. మరీ కొందరైతే పాముల జోలి అస్సలు వద్దంటారు. చెరువులు ఉన్న చోట పాములు కన్పిస్తుంటాయి. ఎలుకల కోసం మన ఇళ్లలోకి పాములు సీక్రెట్ గా ప్రవేశిస్తుంటాయి. పాముల  కన్పిస్తే చాలా మంది పాములు పట్టేవాళ్లకు సమాచారం ఇస్తారు. మరికొందరు మాత్రం పాములను చంపుతు పైశాచిక ఆనందం పొందుతారు.

Add Zee News as a Preferred Source

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @si_kirtan

పాముల్ని చంపితే.. లేని పోనీ దోషాలు వస్తాయని పండితులు చెప్తుంటారు. అందుకే పాములకు ఎలాంటి అపకారం చేయోద్దని కూడా జాగ్రత్తలు చెప్తుంటారు. పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా వార్తలలో ఉంటాయి. కొన్ని వీడియోలు చూస్తే బాబోయ్ అన్పించేలా ఉంటే, మరికొన్ని దండంరా సామీ అన్న విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఒక పాములకు చెందిన వీడియో ట్రెండింగ్ గా మారింది. 

పూర్తి వివరాలు.. 

చాలా మంది తమ ఇళ్లలో కుక్కలు, పిల్లులు,మేకల్ని పెంచుకుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తుంటాం. కానీ కొందరు క్రూరమైన జంతువులు, పాములు, కొండచిలువల్ని సైతం తమ ఇళ్లలోకి తెచ్చుకుంటారు. బెడ్ మీద ఉంచుకుంటారు. ఇంట్లో ప్రత్యేకంగా ఒక గదిలో పాముల్ని, కొండ చిలువల్ని వదిలేస్తుంటారు. అచ్చం.. ఇక్కడకూడా ఒక మహిళ కూడా పాముల్ని పెంచుకుంటుందో ఏంటో కానీ.. ఆమె వాటికి స్నానం చేయిస్తున్న ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.

ఒక గిన్నెలో నీళ్లను తీసుకుని దానిలో.. పాముల్ని ముంచుకుంటూ తీసుకుంటూ పక్కన పెడుతుంది. అంతే కాకుండా.. పాములను అదేదో చిన్న పిల్లలకు తలంటూ పోసినట్లు స్నానం చేయిస్తుంది.అంతే కాకుండా.. నీళ్లలో పాముల్ని ముంచి తీస్తు పాముల్ని సబ్బుతో తోముతుంది.

Read more: Snake Video: వడ్డానం అనుకుంటుందా ఏంటీ..?.. పామును నడుముకు చుట్టుకున్న యువతి.. షాకింగ్ వీడియో వైరల్..

ఈ వీడియో వైరల్ గామారింది. కొంత మంది నెటిజన్ లు ఈ మహిళ చేస్తున్న పనికి షాక్ అవుతుంటే.. మరికొందరు రాత్రి డిన్నర్ లో ఆ పామును తింటారా ఏంటని డౌటనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం సామాజిక మాధ్యమాలలో తెగ హల్ చల్ చేస్తోంది.
 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News