Horoscope Today August 13th : నేటి రాశి ఫలాలు... అవివాహితులైన ఆ రాశి వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం..

ఇవాళ శనివారం. శనీశ్వరుడికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ శని అనుగ్రహం పొందినట్లయితే కష్టనష్టాలు, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. మరి ఈ శనివారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 13, 2022, 06:53 AM IST
  • ఇవాళ శనివారం.. శనీశ్వరుడికి అంకితం
  • శని దేవుడి అనుగ్రహం పొందితే బాధల నుంచి విముక్తి
  • ఈ శనివారం ఏ రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే
Horoscope Today August 13th : నేటి రాశి ఫలాలు... అవివాహితులైన ఆ రాశి వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం..

Horoscope Today August 13th 2022: ఇవాళ శనివారం. శనీశ్వరుడికి అంకితం చేయబడిన రోజు. ఇవాళ శని అనుగ్రహం పొందినట్లయితే కష్టనష్టాలు, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. మరి ఈ శనివారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం... 

మేష రాశి (Aries)

రాజకీయ రంగంలో ఉన్నవారికి కలిసొస్తుంది. కొత్త పదవి దక్కే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల సహాయ సహకారాలు పొందుతారు. ప్రొఫెషనల్ డీల్స్‌కు సంబంధించి నష్టాలు రావొచ్చు. చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి కావు. భవిష్యత్తు గురించి బెంగ ఏర్పడుతుంది. అయితే పోటీ ఉండే రంగంలో మీరు బాగా రాణించగలరు. మీలో నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

వృషభ రాశి (Taurus)

అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో పనిచేసేవారు వృత్తిరీత్యా బాగా రాణించగలరు. తల్లిదండ్రుల నుంచి అన్నివిధాలా సహాయ సహకారాలు లభిస్తాయి. బిజినెస్, కెరీర్ పరంగా అంతా బాగుంటుంది. ఇవాళ అదృష్టం మీ చుట్టూ తిరుగుతుంది. వ్యాపార కార్యకలాపాలు మెరుగవుతాయి.ఉద్యోగస్తులకు సహోద్యోగులు సహకరిస్తారు. మీ పట్ల గౌరవం, గుర్తింపు మరింత పెరుగతాయి. 

మిథున రాశి (GEMINI)

మీ పిల్లల సక్సెస్ మిమ్మల్ని సంతోషంలో ముంచెత్తుతుంది. కుటుంబపరంగా ఇవాళ అంత సాఫీగా సాగకపోవచ్చు. అయితే కుటుంబ బాంధవ్యాలు మరింత మధురంగా, ఆత్మీయంగా మారుతాయి. ఒకరికొకరు సాయపడే తత్వం పెరుగుతుంది. బిజినెస్‌లో ఒక్కసారిగా బూమ్ వస్తుంది. అకడమిక్ రంగంలో ఉన్నవారికి అనుకూల సమయం. ఇవాళ ఏ పని చేపట్టినా సానుకూల ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.

కర్కాటక రాశి (Cancer) 

ప్రేమలో ఉన్నవారు తమ ప్రేయసి లేదా ప్రియురాలిని ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించకూడదు. లేనిపక్షంలో కొత్త తలనొప్పులు మొదలవుతాయి. ఎవరితో మాట్లాడినా మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. కొత్త వ్యక్తులతో పరిచయాలు స్నేహంగా మారుతాయి. బ్యాచిలర్స్‌కి పెళ్లి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి. రిస్క్‌తో కూడిన పనులకు దూరంగా ఉండండి. ఇవాళ మీ సక్సెస్ స్థాయి సాధారణమని చెప్పొచ్చు.

సింహ రాశి (LEO)

కోపాన్ని నియంత్రించుకోండి. లేనిపక్షంలో ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. దీర్ఘకాలికంగా బాధిస్తున్న వ్యాధి కొంత నయమవుతుంది. తద్వారా కాస్త ఉపశమనం పొందుతారు. వీలైతే ధ్యానం, యోగా ప్రాక్టీస్ చేయండి. మీ పనితనం అందరికీ మీ పట్ల నమ్మకం ఏర్పరుస్తుంది. ఏ పని చేసినా చకచకా పూర్తి చేసేయగలరు. టీమ్ స్పిరిట్‌ పెరుగుతుంది. ప్రైవేట్ విషయాలు లేదా వ్యక్తిగత విషయాలన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి.

కన్య రాశి (Virgo)

ప్రాపర్టీ అమ్మడం లేదా కొనడం చేస్తారు. ఆ ప్రక్రియకు ముందు చట్టపరమైన చిక్కులేమీ లేకుండా చూసుకోవాలి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు అందుతాయి. ఉద్యోగస్తుల వేతనం పెరిగే అవకాశం ఉంది. ప్రొఫెషనల్ లైఫ్ ప్రశాంతంగా గడుస్తుంది. ఎవరి వద్దు అప్పు ఆశించవద్దు. మీరు కూడా ఇతరులకు అప్పు ఇవ్వొద్దు. ఆర్థిక లావాదేవీలకు ఇది ప్రతికూల సమయం.

తులా రాశి (Libra)

సృజనాత్మక రంగంలో ఉన్నవారు, గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవారు బాగా రాణించగలరు. చేపట్టిన పనులను ఉత్సాహంతో చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. భావోద్వేగపూరితమైన అంశాలను, సంక్లిష్ట సందర్భాలను బాగా డీల్ చేస్తారు. స్నేహితులతో సరదా సమయం గడుపుతారు. మీలో ఛరిష్మా, దూకుడు మరింత పెరుగుతుంది. 

వృశ్చిక రాశి (Scorpio)

మీ జీవిత భాగస్వామి లేదా ప్రేయసి/ప్రియురాలితో ఎక్కువ సమయం గడుపుతారు. ప్రేమికులు పెళ్లి ప్రతిపాదనను పెద్దల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో పాత వివాదాలు సమసిపోతాయి. మీకన్నా వయసులో చిన్నవారిని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. ఎవరో చెప్పింది విని అదే నిజమని నమ్మవద్దు. మీరు కూడా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి.

ధనుస్సు రాశి (Sagittarius)  

తల్లిదండ్రులతో వివాదాలు తలెత్తవచ్చు. గతంలో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు మార్చుకుంటారు. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అబద్దాలు చెప్పడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటారు. ఇవాళ ఏదేని ఒక గుడ్ న్యూస్ అందుతుంది. వ్యాపారులకు, ఉద్యోగస్తులకు అనుకూల సమయం.

మకర రాశి (Capricorn) 

ప్రేమ బంధం మరింత బలపడుతుంది. పెళ్లయినవారు తమ జీవిత భాగస్వామి నుంచి బహుమతులు పొందుతారు. పెళ్లి సంబంధాలు చూస్తున్నవారికి మంచి సంబంధం కుదురుతుంది. ఇప్పటికే రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పార్ట్‌నర్ ఆలోచనలను ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేయాలి. మీ వర్క్ సీనియర్స్‌ను ఇంప్రెస్ చేస్తుంది. 

కుంభ రాశి (Aquarius)

ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. బిజినెస్ విస్తరణకు ప్రయత్నాలు మొదలుపెడుతారు. ఇవాళ ఎవరి వద్ద అప్పు తీసుకోవద్దు. ఐరన్ ట్రేడర్స్‌కు ఇవాళ లాభదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శించే  అవకాశం ఉంది.

మీన రాశి (Pisces) 

అనవసరంగా బయట తిరగవద్దు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. తప్పనిసరిగా రోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఎక్కువ నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. ప్రేమ వ్యవహారాల్లో సున్నితంగా వ్యవహరించాలి. కుటుంబం, స్నేహితులు, సన్నిహితులు అందరితో మీ రిలేషన్ బాగుంటుంది. స్నేహితులు కష్టకాలంలో సహాయపడుతారు.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Ranveer Singh: న్యూడ్ ఫోటోషూట్ వివాదం.. రణవీర్ ఇంటికి పోలీసులు!

Also Read: Prabhas: అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న ప్రభాస్.. ఆ బ్యానర్లో మరో సినిమా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News