saturn retrograde 2022: శని తిరోగమనం.. 141 రోజులపాటు ఈ 4 రాశుల వారికి కష్టాలు!

Astrology: మరికొద్ది రోజుల్లో శని గ్రహం తిరోగమనం ప్రారంభం కానుంది. ఈ ప్రభావం వల్ల 4 రాశుల వారికి చెడు జరగనుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 05:05 PM IST
saturn retrograde 2022: శని తిరోగమనం.. 141 రోజులపాటు ఈ 4 రాశుల వారికి కష్టాలు!

Saturn Retrograde June 2022 Effect on Zodiac signs: జ్యోతిష్యం పరంగా రాబోయే 10 రోజులు చాలా ముఖ్యమైనవి. ఈ నెల 30వ తేదీన శని జయంతి (Shani Jayanti 2022) వస్తోంది. 30 ఏళ్ల తర్వాత ఈసారి శని జయంతి రోజున శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరించనుంది. జూన్ 5 నుంచి అక్టోబరు 23 వరకు శని తిరోగమనంలో (Saturn Retrograde 2022) ఉంటుంది.  ఇది 141 రోజుల పాటు అన్ని రాశిచక్ర గుర్తులపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా 4 రాశుల వారికి శని తిరోగమనం వల్ల కష్టాలు రావచ్చు.  ఈ సమయంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రాశులేంటో చూద్దాం. 

మేషం (Aries)- శని తిరోగమనం మేష రాశి వారికి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ సమయం ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. పెట్టుబడికి దూరంగా ఉండటం మంచిది, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఇది వైవాహిక జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఇంట్లో గొడవలు రావచ్చు. టెన్షన్, అపార్థాలు పెరుగుతాయి. 

కర్కాటకం (Cancer)- శని తిరోగమనంలో కర్కాటక రాశి వారు ఇబ్బందులు ఎదుర్కోంటారు. వీరు ప్రమాదాల బారిన పడవచ్చు.  కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆదాయంలో తగ్గుదల ఉండవచ్చు. ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మీకు మంచిది కాదు. వీలైతే, అలాంటి నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేయండి. ఖర్చులను నియంత్రించుకోవడం కూడా చాలా ముఖ్యం. 

మకరం (Capicron)- మకరరాశి వారు శని తిరోగమనం ఎదుర్కొంటారు. ఇది వీరి కెరీర్‌పై చెడు ప్రభావం చూపుతుంది. కెరీర్‌లో ఆటంకాలు, ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. కటువుగా మాట్లాడటం, కోపగించుకోవడం హాని కలిగిస్తాయి. ధన నష్టం కూడా రావచ్చు. మొత్తంమీద, ఈ సమయంలో ఓర్పు మరియు సంయమనంతో ముందుకెళ్లండి.

కుంభం (Aquarius)- తిరోగమన శని కుంభ రాశి వారికి అశుభ ఫలితాలను ఇవ్వగలదు. ఈ సమయం ఈ వ్యక్తులకు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందిని కలిగిస్తుంది. వివాహం లేదా సంబంధం కాలక్రమేణా విచ్ఛిన్నం కావచ్చు. వైవాహిక జీవితంలో అపార్థాలు ఏర్పడవచ్చు. పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఎవరినీ పెళ్లి చేసుకోకండి. మీ ప్రియమైన వారిని బాగా చూసుకోండి.

Also Read: June 2022 Planetary Changes: జూన్‌లో రాశిచక్రాన్ని మార్చబోతున్న 5 గ్రహాలు.. ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News