Vasant Panchami 2023: ప్రతి సంవత్సరం వసంత పంచమిని తిథిల ప్రకారం జరుపుకుంటారు. అయితే ఈ సంవత్సరం తిథి నక్షత్రాల ప్రకారం జనవరి 26న రాబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మాఘమాసంలో శుక్ల పక్షంలోని 5వ రోజున జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా మాఘమాసం గుప్త నవరాత్రులలో మా సరస్వతి దర్శించుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అందుకే చాలా మంది ఇదే రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. కొంత మంది భక్తులైతే సరస్వతి ప్రకత్యోత్సవంలో పాల్గొంటారు. అయితే రేపు సరస్వతి దేవి ఏ సమయంలో పూజా కార్యక్రమాలు చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
పంచాగం ప్రకారం.. పంచమి తిథి ఉదయం 7:16 గంటలకు సూర్యోదయం నుంచి 10:16 వరకు పంచమి తిథి వరకు ఉంటుంది. దీనిని శుభ గడియలుగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.. అయితే ఇదే క్రమంలో సరస్వతి దేవి భక్తి శ్రద్ధలతో పూజించి.. పిల్లల చేత అక్షరాభ్యాసం, ప్రత్యేక పూజలు చేయిస్తే భవిష్యత్‌లో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా విద్యలో ఎలాంటి ఆటంకాలు రావని భక్తుల నమ్మకం.
ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు.. కాబట్టి ఈ రోజు ఎలాంటి శుభ కార్యాలు చేసిన చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రోజు ఎలాంటి వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించిన లాభాలు పొందుతారు. ముహూర్త ప్రకారం పూజా కార్యక్రమాలు చేస్తే సరస్వతి దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా వసంత పంచమిని రోజు గృహ ప్రవేశం, వాహనం కొనుగోలు చేయడం వల్ల అంత మంచి జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Aso Read: Pawan Kalyan's Fan Death News: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. అభిమాని మృతి
Also Read:l RGV on Pawan: గుడిలో ఉంటే వారాహి, రోడ్డు మీద ఉంటే పంది.. పవన్ పై మళ్లీ రెచ్చిపోయిన వర్మ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook