ఐసీసీ ( ICC ) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపధ్యంలో నిరాశకు గురవుతున్న క్రికెట్ అభిమానులకు ( Cricket lovers ) ఇది నిజంగా గుడ్‌న్యూస్. ఇక వరుసగా మూడేళ్లపాటు అభిమానులు పండగ చేసుకోనున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటో తెలుసా..
ఐసీసీ ( International Cricket Council ) సోమవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీ20 వరల్డ్‌కప్ ( T20 world cup ) తో సహా పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలతో క్రికెట్ లవర్స్ ఇక పండగ చేసుకోనున్నారు. ఈ ఏడాది జరగాల్సిన ప్రపంచకప్ ( World cup ) ను వచ్చే యేడాదికి వాయిదా వేసింది ఐసీసీ. దాంతో వరుసగా మూడేళ్లపాటు మూడు ప్రపంచకప్ ఫార్మాట్ ( Three world cup formats ) లు జరగనున్నాయి. ఇందులో రెండు టీ20 వరల్డ్‌కప్ లు కాగా మూడోది వన్డే ప్రపంచకప్ గా ఉంది. Also read: ICC T20 World Cup 2020: ఐసిసి టీ20 వరల్డ్ కప్ వాయిదా
కరోనా మహమ్మారి ( Corona pandemic ) కారణంగా టీ20 ప్రపంచకప్ వాయిదా పడింది. దాంతో ఐపీఎల్ ( IPL ) కు మార్గం సుగమమైంది. టీ20 వరల్డ్‌కప్ ను ఐసీసీ వాయిదా వేయడంతో ఐపీఎల్ కోసం బీసీసీఐ ( BCCI ) ప్రణాళిక రచిస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య కాలంలో టీ20 వరల్డ్‌కప్ జరగవచ్చు. ఐసీసీ తీసుకున్న నిర్ణయంతో వరుసగా మూడేళ్ల పాటు మూడు ప్రపంచకప్ ( Three years Three World cups ) లు జరగనున్నాయి. 2021, 2022లలో టీ20 వరల్డ్‌కప్ లకు భారతదేశం ( India ) , ఆస్ట్రేలియా ( Australia ) లు మార్చుకునే అవకాశాలున్నట్టు ఐసీసీ తెలిపింది. మరోవైపు 2023లో ఎలాగూ వన్డే ప్రపంచకప్ జరగాల్సి ఉంది. వరుసగా మూడేళ్ల పాటు మూడు ప్రపంచకప్ లు జరగనుండటంతో వేదికలపైనే సందిగ్దత నెలకొననుంది. Also read: ENG vs WI: మ్యాచ్ ఆపి.. బంతిని శానిటైజ్ చేసిన అంపైర్