India vs Australia World Cup 2023 Updates: విరాట్ కోహ్లీ ఫీల్డ్‌లో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్యాచ్‌లు అందుకునే సమయంలో పాదరసంలా కదులుతూ అద్భుతంగా పడుతుంటాడు. తాజాగా అలాంటి అద్భుతమైన క్యాచ్‌ను ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో అందుకున్నాడు. చెపాక్ స్టేడియంలో ఆసీస్‌తో వరల్డ్ కప్ తొలి పోరులో టీమిండియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కంగారూ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఆరంభంలోనే ఆసీస్‌కు షాకిచ్చాడు టీమిండియా పేసర్ బుమ్రా. ఓపెనర్ మిచెల్ మార్ష్ డకౌట్ చేశాడు.
బుమ్రా వేసిన బంతి.. మార్ష్ డిఫెన్స్ ఆడేందుకు యత్నించగా.. బాల్ ఎడ్జ్ తీసుకుంది. స్లిప్స్‌లో నిలుచున్న విరాట్ కోహ్లీ.. వెంటనే ఆమాంతం గాల్లో ఎగిరి బాల్‌ను అందుకున్నాడు. ఈ క్యాచ్‌తో చెపాక్ మొత్తం ప్రపంచకప్‌లో భారత్ తొలి వికెట్ తీసి సంబరాలు చేసుకుంది. ఈ క్యాచ్‌తో కోహ్లీ మరో రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ప్రపంచకప్‌లలో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. ప్రపంచ కప్‌లలో ఫీల్డర్‌గా 15 క్యాచ్‌లను అందుకున్నాడు కోహ్లీ.
What a catch by Virat Kohli😲
Dangerous #MitchellMarsh gone for duck 🦆
Well bowled #Bumrah#INDvsAUS pic.twitter.com/3jzEa1lau9
— Abhishek (@Abhik_world) October 8, 2023
ఇక ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ల ధాటికి ఆసీస్ టీమ్ 49.3 ఓవర్లలో 199 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ కంగారూలను కట్టడి చేశారు. రవీంద్ర జడేజా మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ స్మిత్ (46), డేవిడ్ వార్నర్ (41) మాత్రమే రాణించగా.. మిగిలిన బ్యాట్‌మెన్ విఫలమయ్యారు. లబూషేన్ (27), గ్లెన్ మాక్స్‌వెల్ (15), అలెక్స్ కారీ (0), కెమెరూన్ గ్రీన్ (8), కెప్టెన్ పాట్ కమిన్స్ (15)లు తక్కువ వ్యవధిలోనే పెవిలియన్‌కు చేరిపోయారు. మిచెల్ స్టార్క్ (28) చివర్లో వేగంగా ఆడాడు. 200 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగనుంది. శుభ్‌మన్ గిల్ డెంగ్యూతో బాధపడుతూ కోలుకోకపోవడంతో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానున్నాడు.
Also Read: India vs Australia World Cup 2023: ఆసీస్‌ను భయపెట్టిన బౌలర్లు.. భారత్‌కు ఈజీ టార్గెట్
Also Read: Ravi Teja: 'అవకాశం వస్తే ఆ క్రికెటర్ బయోపిక్ లో నటిస్తా'..: హీరో రవితేజ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి