India Captain Rohit Sharma says Pakistan match is always a blockbuster: భారత్ ప్రపంచకప్ గెలిచి చాలా కాలమైందని, ఆస్ట్రేలియాలో కప్ గెలవాలంటే తాము చాలానే చేయాలని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఆటగాళ్లంతా ప్రశాంతంగా ఉండి ఆటపై దృష్టి పెట్టాలన్నాడు. జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం అని రోహిత్ చెప్పాడు. భారత్ చివరిసారిగా 2013లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకుంది. ఇక 2011లో వన్డే ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఇప్పటికి 11 సంవత్సరాలు అయినా భారత్ ప్రపంచకప్ గెలవలేదు.
బీసీసీఐ టీవీతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'మేము ప్రపంచకప్ గెలిచి చాలా కాలం అయ్యింది. ప్రపంచకప్ గెలవాలన్నదే మా లక్ష్యం. సహజంగా అన్ని జట్లు కూడా ఇదే కోరుకుంటాయి. అయితే కప్ గెలవడం కోసం మేము చేయాల్సింది చాలానే ఉంది. ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్లాలి. తదుపరి ఆడబోయే జట్టుపై మాత్రమే దృష్టిపెడతాం. సెమీ ఫైనల్స్, ఫైనల్ గురించి ఆలోచించడం తొందరపాటు అవుతుంది' అని అన్నాడు.
'పాకిస్తాన్‌తో ఎప్పుడు మ్యాచ్ ఆడినా బ్లాక్‌బస్టర్‌గా ఉంటుంది. ఫాన్స్ ఈ మ్యాచ్ చూడాలని మరియు అనుభూతి చెందాలని కోరుకుంటారు. సహజంగానే వారు క్రికెట్‌ను కూడా ఆస్వాదించాలని కోరుకుంటారు. స్టేడియంలోని అభిమానులు, ప్రేక్షకులు మరియు టీవీల్లో చూసే ప్రజలకు కూడా ఈ మ్యాచును ఎంజాయ్ చేస్తారు. ఆటగాళ్లుగా మాకు ఇది చాలా పెద్ద మ్యాచ్. అయితే చాలా రిలాక్స్‌గా ఉండాలనుకుంటున్నాము. గేమ్ సమయంలో ప్రశాంతంగా ఉంటే ఫలితాన్ని పొందుతాము' అని రోహిత్ చెప్పాడు.
'భారత జట్టుకు నాయకత్వం వహించడం గొప్ప గౌరవం. కెప్టెన్‌గా నాకు ఇదే తొలి ప్రపంచకప్. చాలా ఉత్తేజంగా ఉంది. పెర్త్‌లో మా ప్లేయర్స్ ప్రాక్టీస్ బాగా సాగింది. ఆస్ట్రేలియాలో సవాలు భిన్నంగా ఉంటుంది. అందుకే అలవాటు పడడానికి మేం ఇక్కడి త్వరగా వచ్చాం. ఇక్కడి పిచులపై కాస్త అవగాహన ఏర్పడింది' అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
Also Read: విరాట్ కోహ్లీకి టీ20 ప్రపంచకప్ 2022 చివరిదా.. కోచ్ ఏంచెప్పాడంటే?
Also Read: Surya Grahan 2022: సూర్యగ్రహణం తీవ్ర ప్రభావం ఈ రాశులపై.. తస్మాత్ జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook