Salman Butt praises BCCIs rotation policy: మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆగష్టు 18 నుంచి భారత్, జింబాబ్వే జట్ల మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. జింబాబ్వే పర్యటనలో కెప్టెన్సీలో మార్పు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు ముందుగా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించగా.. తాజాగా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను బీసీసీఐ సారథిగా ఎంపిక చేసింది. ఇక రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు విరామం ఇచ్చిన బీసీసీఐ.. జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను జట్టుతో పాటుగా పంపింది.
బీసీసీఐ అవలంభిస్తున్న రొటేషన్ పద్ధతి చాలా బాగుందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ కొనియాడాడు. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతిని ఇస్తూ యువకులకు మరిన్ని అవకాశాలు కల్పించడం మంచి విషయమన్నాడు. బీసీసీఐ చేపడుతున్న రొటేషన్ పాలసీ వల్ల రిజర్వ్ బెంచ్ బలోపేతమవుతుందని సల్మాన్ అభిప్రాయపడ్డాడు. సల్మాన్ భట్ మాట్లాడుతూ.. 'బీసీసీఐ అవలంభిస్తున్న రొటేషన్ పద్ధతి చాలా బాగుంది. ఆటగాళ్లకే మాత్రమే కాదు కోచ్‌కు కూడా విశ్రాంతిని ఇవ్వడం ఇంకా బాగుంది. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ విరామం తీసుకోవడం విశేషం. మానవ వనరులను వృద్ధి చేసుకోవడంలో భారత క్రికెట్లో అద్భుత పరిణామం' అని అన్నాడు.
'ఆటగాళ్ల రొటేషన్ పద్ధతి వల్ల మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి సిరీస్‌లో ఒకే జట్టు ఆడకుండా కొత్తవారికి అవకాశం వస్తుంది. యువ ఆటగాళ్లకు కూడా కలిసొస్తుంది. సీనియర్ల ఆటగాళ్ల గైర్హాజరీలో తమ సత్తాను చాటుకోవాలని యువ క్రికెటర్లు భావిస్తారు. ఇక బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్లో విభిన్న కాంబినేషన్లను ప్రయత్నిస్తూ భారత్ తమ ఆప్షన్లను పెంచుకుంటుంది. ఇప్పటికే చాలా మంది యువ ప్లేయర్స్ టీమిండియాకు అందుబాటులో ఉన్నారు. రొటేషన్ పద్ధతి భారత్‌కు సాధారణ ప్రక్రియగా మారిపోయింది' అని సల్మాన్ చెప్పుకొచ్చాడు.
Also Read: కెరీర్ మొత్తంలో రనౌట్ కాని ప్లేయర్స్ వీరే.. భారత ప్లేయర్ కూడా ఉన్నాడు!
Also Read: Telangana Rain Alert: తెలంగాణను వదలని వరుణుడు.. మరో రెండు రోజులు కుండపోత వర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి