కోహ్లీ దీపికాతో నటించకపోతే ఆర్సీబికి నష్టమే..!

ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్‌కు విరాట్ కోహ్లీతో చేసుకున్న ఓ కాంట్రాక్టు వల్ల రూ.11 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. 

Last Updated : Mar 23, 2018, 01:08 PM IST
కోహ్లీ దీపికాతో నటించకపోతే ఆర్సీబికి నష్టమే..!

ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్‌కు విరాట్ కోహ్లీతో చేసుకున్న ఓ కాంట్రాక్టు వల్ల రూ.11 కోట్ల రూపాయల నష్టం సంభవించింది. ఆ కాంట్రాక్టులోని నియమ నిబంధనల ప్రకారం కోహ్లీ ఏ ఇతర ప్రముఖ సెలబ్రిటీలతోనూ కలిసి నటించకూడదు. అయితే అదే కాంట్రాక్టు వల్ల గోఐబీబీబో వెబ్ సైటుతో చేసుకోవాల్సిన ఓ ఒప్పందం, ఆర్సీబీకి తుడుచుపెట్టుకుపోయింది.

ఆర్బీబితో కలిసి కాంట్రాక్టు చేసుకోవాలంటే గోఐబీబీబో.కామ్ యాడ్‌లో కోహ్లీ, హీరోయిన్ దీపికా పడుకొనేతో కలిసి తప్పనిసరిగా నటించాల్సి ఉంది. కాకపోతే అది విరాట్ కోహ్లీతో చేసుకున్న కాంట్రాక్టు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో ఆర్సీబీ ఆ వెబ్ సైటుతో కాంట్రాక్టును రద్దు చేసుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ జట్టుకి విరాట్ కోహ్లీ కెప్టెన్‌‌గా వ్యవహరిస్తుండగా.. డేనియల్ వెటోరీ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. 

Trending News