Hardik Pandya Instagram Followers: టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా కెరీర్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లను పక్కనబెట్టి.. టీ20 ఫార్మాట్‌కు పాండ్యాను ఎంపిక చేసింది బీసీసీఐ. టీ20ల్లో జట్టును అద్భుతంగా నడిపించడంతో వన్డే జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఆసీస్‌తో మొదటి వన్డేకు రోహిత్ శర్మ దూరం కానున్న నేపథ్యంలో పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇక సోషల్ మీడియాలో ఈ స్టార్ ప్లేయర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే ఓ రికార్డు కూడా సృష్టించాడు.
ఇన్‌స్టాగ్రామ్‌లో హార్దిక్‌ను అనుసరించే వారి సంఖ్య ఇప్పుడు 25 మిలియన్లను దాటింది. ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సులో ఈ ఫీట్ సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్, మాక్స్ వెర్‌స్టాపెన్, ఎర్లిగ్ హాలాండ్ వంటి గ్లోబల్ స్టార్‌ల కంటే.. పాండ్యానే ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను కలిగి ఉండడం విశేషం. ఈ సందర్భంగా హార్దిక్ తన కృతజ్ఞతలు తెలియజేశాడు. 'నా అభిమానులందరీ ప్రేమకు ధన్యవాదాలు. అభిమానులందరూ నాకు ప్రత్యేకమైనవారు. ఇన్నాళ్లుగా వారు నాకు అందించిన ప్రేమ, మద్దతుకు నేను వారికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను..' అని అన్నాడు.
ఫీల్డ్‌లో ఎంత దూకుడుగా ఉంటాడో పాండ్యా.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటాడు. తన భార్య, పిల్లలు, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాడు. గత కొన్ని రోజులుగా పాండ్యా క్రికెట్‌తో పాటు తన ఫ్యామిలీ ఫంక్షన్‌లతో చాలా బిజీగా ఉన్నాడు. ఆ పిక్స్‌ను నిత్యం షేర్ చేస్తుండడంతో పాండ్యా ఖాతా ఫాలోవర్ల సంఖ్య చాలా వేగంగా పెరిగింది.
2016లో హార్ధిక్ పాండ్యా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2018 నుంచి టెస్టుల్లో ఆడలేదు. వెన్నునొప్పి నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన తరువాత కీలక సభ్యుడిగా ఎదిగాడు. గతేడాది ఐపీఎల్ ట్రోఫీ తన జట్టు గుజరాత్ జెయింట్స్‌కు అందించిన పాండ్యా.. పొట్టి ప్రపంచ కప్ తరువాత టీమిండియా టీ20 కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Also Read: Holi 2023: హోలీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. నిరుద్యోగ భృతి ప్రకటన
Also Read: Twitter: ట్విట్టర్‌లో కీలక మార్పు.. ట్వీట్ లిమిట్ పెంచుతూ ఎలాన్ మస్క్ ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి