Bandi Sanjay Comments on Ponguleti Srinivas Reddy, Jupalli Krishna Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారిలో పోతుంటే మహిళలు ఇండ్లలోకి పోయి దాచుకునే పరిస్థితి వచ్చింది. బీజేపీ పోరాటాలకు భయపడి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది కానీ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఒక్కటే అని బండి సంజయ్ ఆరోపించారు.
Revanth Reddy Slams BRS: ఆనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేగు బంధం లేదు.. ఈనాడు తెలంగాణతో కేసీఆర్ కు పేరు బంధం లేదు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Bandi Sanjay Letter To CM KCR: రాష్ట్రంలో రిటైర్ట్ ఉద్యోగుల్లో చాలా మందికి పెన్షన్ అందక ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. వెంటనే పింఛన్ డబ్బులు రిలీజ్ చేయాలని.. ఉద్యోగులకు పీఆర్సీ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖలో పూర్తి అంశాలు ఇలా..
Bandi Sanjay On Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 45 సీట్లు వస్తాయని చెప్పడం పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు బండి సంజయ్. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కించుకోలేని పార్టీకి బీఆర్ఎస్ ప్రత్యామ్నయం అవుతుందా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని అన్నారు.
Bandi Sanjay About Journalists Plots: జర్నలిస్టులు డబ్బులు కట్టి కొనుక్కున్న స్థలాన్నే వారికి ఇవ్వడం లేదంటే ఏమనాలి ? ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన జర్నలిస్టులకే న్యాయం జరగడం లేదు. వీళ్లకు స్థలం ఇవ్వాల్సిందేనని.. ప్రజాస్వామ్య మూల స్థంభమైన సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా అమలు చేయడం లేదంటే ఇగ సామాన్యుడిని పరిస్థితి ఏట్లుందో ఒక్కసారి అర్ధం చేసుకోవాలి అని బండి సంజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Bandi Sanjay Warning to KCR: బీఆర్ఎస్ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయబోమని, ఇతర పార్టీల నుండి వచ్చే వాళ్లు పదవులకు రాజీనామా చేసిన తరువాతే బీజేపీలోకి తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి మంచి పోర్టల్ అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ‘‘ధరణి వల్ల లాభపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం లాక్కున్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికే ధరణి తెచ్చారు. ఆ పోర్టల్ బాధితులతో ఏకంగా బహిరంగ సభ నిర్వహించవచ్చు’’అంటూ ఎద్దేవా చేశారు.
Telangana bjp chief bandi sanjay: తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెక్ బౌన్సర్ సీఎం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో రైతులు బతికే పరిస్థితి లేదని కేసిఆర్ పుణ్యమా అని రైతులు బ్యాంకులలో డిఫాల్టర్లుగా నమోదయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు.
Bandi Sanjay Condemns False Allegations On Prakash Javadekar: వేములవాడ రాజన్న ఆలయంలోకి కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పులు ధరించి వెళ్లాడంటూ సోషల్ మీడియాలో జరగుతున్న ప్రచారాన్ని బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. సాక్సులకు, చెప్పులకు తేడా తెలియని ఫాల్తుగాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
Bandi Sanjay on BRS: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అన్నారు. తాము సింగిల్‌గానే ఎన్నికల బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని చెప్పారు.
Chandrababu Naidu Amit Shah Meeting: టీడీపీతో బీజేపీ పొత్తు అని వస్తున్న వార్తలు అన్నీ ఊహజనితమేనని కొట్టిపారేశారు బండి సంజయ్. అమిత్ షాను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. వీరు పొత్తులపైనే చర్చించారనేది కరెక్ట్ కాదన్నారు.
BJP President Bandi Sanjay on Telangana Formation Day: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించడలేదని మండిపడ్డారు.
Bandi Sanjay Tweets on BRS Govt Failures: బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఎత్తిచూపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. చిన్నపాటి వర్షానికే నీట మునిగిన హైదరాబాద్ రోడ్ల నీట మునుగుతున్నాయని అన్నారు.
Bandi Sanjay Writes open letter to Telangana CM KCR: ఇప్పటికే మీ ప్రభుత్వానికి లిక్కర్, లీకేజి, ప్యాకేజీల పేరుతో అవినీతి మరకలు అంటాయి. ఇప్పుడు మీ మౌనం ఓఆర్ఆర్ టెండర్లో భారీ స్కామ్ జరిగిందనే అనుమానాలను బలపరుస్తున్నాయి అని తెలంగాణ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. బండి సంజయ్ రాసిన ఈ లేఖలో ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. అవి ఏంటంటే..
Minister Harish Rao Speech in Achhampeta BRS meeting: తెలంగాణ గొప్పతనం నిలిపే విధంగా కేసిఆర్ సెక్రటేరియట్ కడితే.. బిజెపి నాయకుడు కూలగొడతా అన్నాడు. కాంగ్రెస్ వారు పేల్చేస్తాం అన్నాడు. కూల్చేటోడో లేక పేల్చేటోడో కావాలా.. లేదంటే తెలంగాణ నిర్మించేటోడు కావాలా అనేది జనమే నిర్ణయించుకోవాలి అని మంత్రి హరీష్ రావు సూచించారు.
ప్రజా సమస్యలపై బీజేపీ పోరాడుతుంటే... ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలని మండిపడ్డారు. పొరపాటున కేసీఆర్ కు మళ్లీ అధికారమిస్తే యువత అంతా సూసైడ్ నోట్ రాసుకున్నట్లేనని హెచ్చరించారు. కొలువులు కావాలంటే కమలం రావాలంటూ నినదించారు. ఖమ్మం నిరుద్యోగ ర్యాలీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బండి సంజయ్ చురకలు అంటించారు.
TPCC Chief Revanth Reddy Challenges Ministers KTR, Harish Rao: లక్ష కోట్ల విలువైన ఆస్తిని కేవలం రూ.7,300 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం చాలా చిన్నదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఇంత బహిరంగంగానే దోపిడీ జరుగుతుంటే బీజేపీ నేతలు ఏంచేస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండకపోవచ్చని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. బండి సంజయ్‌తో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశారు. పదవి ఇవ్వకున్నా పార్టీ ఆదేశాల మేరకు తాను పనిచేస్తానని చెప్పారు.
బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ గత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. టికెట్లు కావాలంటే ప్రజల మధ్యన తిరగాల్సిందేనని స్పష్టం చేశారు.
BJP State Executive Meeting At Champapet: ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని.. విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.