సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో విచారణకు హాజరు కావాలని ఆమె భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కోర్టు సమన్లు జారీ చేసింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ఓ 23 ఏళ్ల యువతి ఆటో కోసం వేచి చూస్తుండగా.. రిక్షా నడుపుకొనే ఓ యువకుడు తాగేసి వచ్చి ఆమెను వేధించసాగాడు. అంతేకాకుండా.. ఆమె చేయి కూడా పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. తొలుత అతని చర్యకు భయపడిపోయిన ఆ యువతి ఆ తర్వాత ఎదిరించింది.
వివాదాస్పద సాధ్వి రాధే మా మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఏకంగా దిల్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి, పోలీస్ అధికారి కుర్చీలో కూర్చోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు విషయానికి వస్తే.. గతవారం రాధే మా దిల్లీలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి .. ఏకంగా పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి సీటులో కూర్చున్నారు. ఆ అధికారి పక్కన నిల్చొని చేతులు కట్టుకొని నిల్చున్నాడు. భుజంపై ఎర్ర చున్నీ ధరించాడు. ఈ ఫోటో బయటికి రావడంతో రాధే మాను పోలీసులు వీవీఐపిలా గౌరవించారంటూ వార్తలు వచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.