Telangana High Court on Online Classes: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థల్లో ఆన్ లైన్ బోధనలను కొనసాగించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఈ నెల 20న మరోసారి విచారణ జరపనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.
land price in Hyderabad: ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్‌లో భూముల ధరలు మరోసారి పెరిగాయి. సరూర్ నగర్ ప్రాంతంలో ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.
Telangana Schools Reopen: కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణలో ఈ నెల 30 వరకు మూతపడిన పాఠశాలలు తిరిగి తెర్చుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడం వల్ల పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం.
Mulugu Siddanthi: ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, పంచాంగ కర్త ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్ను మూశారు. ఆనారోగ్యం కారణంగా ఆయన ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
Secunderabad Club Fire Accident: దేశంలోని ప్రతిష్ఠాత్మక క్లబ్బుల్లో ఒకటైన సికింద్రాబాద్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం (జనవరి 16) తెల్లవారుజామున 3 గం. సమయంలో క్లబ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
IIT Hyderabad Corona: హైదరాబాద్ లోని ఐఐటీలో కరోనా కలవరం రేపుతోంది. క్యాంపస్ లోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 119 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైరస్ సోకిన వారందరినీ ఐఐటీ హైదరాబాద్ వసతి గృహంలోనే ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసినట్లు యాజమాన్యం తెలిపింది.
Telangana Weather Report: రాగల 12 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించింది.
TSRTC Cashless Ticket: తెలంగాణ ఆర్టీసీ సంస్థ మరీ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్ర రోడ్డు రవాణాకు సంబంధించిన బస్సుల్లో నగదు రహిత లావాదేవీలను అమలులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. అయితే తొలుత ఈ కొత్త విధానాన్ని హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే బస్సుల్లో అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
JP Nadda Rally: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటనతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా శంషాబాద్ చేరుకున్న నడ్డాకు పలువురు రాష్ట్ర బీజేపీ నాయకులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిలేదని అధికారికంగా పోలీసులు ప్రకటించారు.
Gang War: కొత్త సంవత్సరం రోజు హైదారాబాద్‌లో ఘోరం జరిగింది. మద్యం మత్తులో రెండు గ్యాంగ్‌లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
Nampally Exhibition 2022: హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్స్ లో 81వ ఎగ్జిబిషన్ అట్టహాసంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో పాటు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ కు వచ్చే వాళ్లు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని.. మాస్క్ ధరించని వారికి అనుమతించవద్దని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారులను ఆదేశించారు.
Omicron Case in Hyderabad: తెలంగాణలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. హైదరాబాద్ నగర శివారు హయత్‌నగర్‌లో 23 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బాధితుడు సూడాన్ నుంచి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్ కు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 25కు చేరింది.
Car Accident at Gachibowli: నగరంలోని గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్‌సీయూ రోడ్లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
Obscene Dance in Pub: యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ఓ పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన ఓ పబ్ పై పోలీసులు దాడి చేయగా.. అందులో 33 మంది పురుషులతో పాటు 9 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
Gold Smuggling Hyderabad: హైదరాబాదీ నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈటీ) అధికారులు అరెస్టు చేశారు. నిబంధలనకు విరుద్ధంగా విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసి.. విక్రయిస్తున్నారని సమాచారం అందుకున్న ఈడీ అధికారులు సంజయ్ ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు.
Septic Tank Cleaners Died: గచ్చిబౌలి ఫరిదిలోని కొండాపూర్ గౌతమి ఎన్‌క్లేవ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషంగా ఉందని పోలీసులు తెలిపారు.
Fire Accident: పరుపుల పరిశ్రమలో మంటలు చెలరేగడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ సంఘటన హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లి వినాయక నగర్ బస్తీలో చోటు చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.