మధ్య ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పంచాయతీ సుప్రీం కోర్టుకు చేరిందా? అయితే గత కొన్ని రోజులుగా రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. మద్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష మార్చి 26కు వాయిదా పడడంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వెంటనే బలపరీక్ష చేపట్టాలని
రిసార్టుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం (మార్చి 15) రాష్ట్రానికి తిరిగొచ్చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజధాని భోపాల్ ఎయిర్ పోర్టుకు చేరుకుని విజయ సంకేతాలిచ్చారు.
మధ్య ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం (Madhya pradesh political crisis) ముదురుతోంది. జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పడంతో మొదలైన రాజకీయ సంక్షోభం.. ఆయన వెంటే 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేయడంతో మరింత ముదిరింది. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ (BJP)లో చేరిన అనంతరం పరిణామాలు పరిశీలిస్తే.. కమల్ నాథ్ సర్కార్ (Kamal Nath govt) ఈ కష్టాన్ని గట్టెక్కడం కష్టమేననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బీజేపీ పంచన చేరిన తర్వాత. . జ్యోతిరాదిత్య సింధియా. . కాంగ్రెస్ పార్టీపై తన గళం విప్పారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కష్ట నష్టాలకోర్చి పని చేశానని చెప్పారు. ఐతే కాంగ్రెస్ పార్టీ గతంలో లేదన్నారు. ఇప్పుడున్న హస్తం పార్టీలో అవినీతి పెచ్చుమీరిపోయిందన్నారు.
ఊహించిందే జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అన్నీ తానై నడిపించి. . చివరికి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి . . 18 ఏళ్ల బంధాన్ని తెంచుకున్న జ్యోతిరాదిత్య సింధియా . . కమలం పార్టీ (బీజేపీ) లో చేరారు.
మధ్యప్రదేశ్ సర్కారు.. సంక్షోభం దిశగా పయనిస్తోంది. అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేయడం .. 19 మంది ఎమ్మెల్యేలు ఏకంగా ఎమ్మెల్యే పదవులకే రాజీనామా ఇచ్చేయడంతో .. కాంగ్రెస్ అధిష్ఠానానికి భారీ షాక్ తగిలింది.
మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిపోయింది. 20 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు బావుటా ఎగరేశారు.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. కమల్ నాథ్ సర్కారును సుడిగుండలో పడేస్తూ . . గ్వాలియర్ రాజవంశంలో మూడో వారసుడు.. కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు.
మధ్యప్రదేశ్ సర్కారు రాజకీయ సుడిగుండంలో చిక్కుకుంది. రోజు రోజుకు కమల్ నాథ్ సర్కారు మరింత ఊభిలో కూరుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. సర్కారుకు వ్యతిరేకంగా ఎదురు తిరిగిన 20 మంది ఎమ్మెల్యేలు ఏ క్షణమైనా రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని ఓ రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లో సర్కారులో మళ్లీ రాజకీయ ముసలం పుట్టింది. కమల్ నాథ్ సర్కారుకు రాజకీయ సుడిగుండం ఏర్పడుతోంది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల సందర్భంగా.. రాజకీయ వేడి రాజుకుంటోంది.
ఈ- కామర్స్ .. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరుకు విక్రయాల్లో రాజ్యమేలుతోంది. ఏ వస్తువైనా కావాలంటే . . ఇప్పుడు అంతా ఆన్ లైన్లో బుక్ చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు సహా .. ఏదైనా కొనాలన్నా.. క్లిక్కుమనిపించాల్సిందే. ఇప్పటి వరకు మద్యానికి మాత్రం మినహాయింపు ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా ఆన్ లైన్లో విక్రయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు .. రోజు రోజుకు ముదురుతున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, యువ నేత జ్యోతిరాదిత్య సింధియా మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. వారిద్దరి మధ్య సైలెంట్ వార్ నడుస్తోంది.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు పొడ చూపుతున్నాయి. సీఎం కమల్ నాథ్ తీరుపై యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా గళమెత్తారు. కమల్ నాథ్ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆయన గుర్రుగానే ఉన్నారు. కానీ అధిష్ఠానంతోపాటు ముఖ్యంగా రాహుల్ గాంధీ బుజ్జగించడంతో ఓపికగా వ్యవహరించారు.
పోలీసులకు.. చేతిలో చట్టం. . గుప్పిట్లో అధికారం. . ఉన్నది ప్రజలను రక్షించడానికి. కానీ ఓ పోలీసు అధికారి చేసిన పని చూస్తే .. ఛీ.. ఛీ అనకుండా మానరు. అలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్ లోని గంధ్వాని పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది.
మధ్యప్రదేశ్‌లో సొంత ప్రభుత్వంపైనే తీవ్ర ఆగ్రహం చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మున్నాలాల్ గోయల్.. ఏకంగా అసెంబ్లీ ఆవరణలోనే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే దీక్షకు దిగడానికి కారణం ఏంటో మీరే చూడండి మరి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.