దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) సంబరాలు అంబరాన్నంటాయి. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ఇండో-టిబెటిన్ (ITBP) జవాన్లు -20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
దేశవ్యాప్తంగా ఈరోజు దీపావళి (Diwali 2020) వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా దీపావళి సందడే కనిపిస్తోంది. ఈ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
షిప్పింగ్ శాఖ పేరును మార్చనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. ఈ మంత్రిత్వశాఖ (Ministry of Shipping) పేరును ‘మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్‌వేస్’గా మార్పు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించారు.
భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ ( Lal Krishna Advani ) నేటితో 93వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అగ్రనేతకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఎల్కే అద్వానీ జన్మదినాన్ని (LK Advani Birthday) పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అద్భుత విజయం సాధించి అమెరికా 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌కు, అదేవిధంగా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతికి చెందిన కమలా హారిస్ (Kamala Harris) కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (president Ram Nath Kovind), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు.
కోవిడ్-19 (Coronavirus) విషయంలో సకాలంలో చర్యలు తీసుకోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi).. మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించారని.. ఈ పని చేయడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విఫలమయ్యారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పేర్కొన్నారు.
బీజేపీ సీనియర్ నేత, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ (92) (Keshubhai Patel) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవల అనారోగ్య సమస్యలతో అహ్మదాబాద్‌లోని స్టెర్లింగ్ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కేశూభాయ్ పటేల్ ఆరోగ్యం విషమించడంతో గురువారం (Keshubhai Patel Passed Away) తుదిశ్వాస విడిచారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. 28న (బుధవారం) రాష్ట్రంలో మొదటి మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల్లో మాత్రమే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన లోక్ జనశక్తి పార్టీ (LJP) అధినేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం సృష్టిస్తోంది. నిత్యం 70వేలకు పైగా కేసులు.. వేయికి చేరువలో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో పండగ సీజన్ ప్రారంభం కానుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు జన్ ఆందోళన్ (jan andolan) కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది.
భారత వైమానిక దళం దినోత్సవ ( Indian Air Force Day ) సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఐఏఎఫ్ (IAF) గ్రాండ్ పరేడ్‌ను నిర్వహించారు.
భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం అంతర్జాతీయ ప్రముఖ నాయకుల్లో ఒకరు. ఎన్నో అంతర్జాతీయ పత్రికలు, మేగజైన్లు అయన్ను ఒక గ్లోబల్ లీడర్ గా అభివర్ణించాయి. అనేక దేశాలను పర్యటించిన మోదీ విదేశాంగ విధానాన్ని బలపరిచారు. అదే విధంగా తన నాయకత్వ పటిమ, మాటలతో ఆయన కోట్లాది మందికి ఫేవరిట్ లీడర్ గా ఎదిగారు.
ఉత్తరప్రదేశ్ హత్రాస్‌లో జరిగిన దారుణ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉన్నతవర్గానికి చెందిన నలుగురు దుండగుల చేతిలో అత్యాచారానికి గురై చనిపోయిన యువతికి న్యాయం చేయాలంటూ దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ మేరకు ప్రజలతోపాటు.. విపక్షాలు యూపీ యోగి ప్రభుత్వాన్ని చుట్టుముడుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ హత్రాస్ (Harthras) లో యువతిపై జరిగిన దురాఘాతానికి వ్యతిరేకంగా దేశం అట్టుడుకుతోంది. మానవ మృగాల చేతిలో యువతి అత్యాచారానికి (hathras gang rape) గురైన బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ యూపీ యోగి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో పలు పార్టీలకు చెందిన ఎంపీలు హత్రాస్‌లో పర్యటించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన సొరంగ మార్గం అటల్ టన్నెల్ (Atal Tunnel) కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శ్రీకారం చుట్టనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్తాంగ్లో ఉన్న ఈ అటల్ టన్నెల్‌ను శనివారం 10 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మిలటరీ ఆసుపత్రిలో చేరారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) శుక్రవారం కరోనా వైరస్ బారిన పడ్డారు.
మహాత్మాగాంధీ 151వ జయంతి (Mahatma Gandhi Birth Anniversary) వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), తదితర నేతలు ఘనంగా నివాళి అర్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.