తెలంగాణ (Telangana) వ్యాప్తంగా దసరా (Dasara 2020) పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రజలు వారి వారి ప్రాంతాల్లోని ఆలయాలకు చేరుకుని కనకదుర్గా (durga devi) అమ్మవారికి పూజలు చేస్తున్నారు. దసరా (Vijayadashami ) పర్వదినం సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ( K. Chandrashekar Rao) ఆదివారం శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశవ్యాప్తంగా దసరా (విజయదశమి) సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. తొమ్మిది రోజుల నుంచి అత్యంత వైభవంగా ప్రకాశవంతంగా జరిగిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) నేటితో ముగియనున్నాయి. దేవినవరాత్రుల్లో భాగంగా చివరిరోజు.. దసరా (విజయదశమి) పర్వదినం నాడు శ్రీ కనకదుర్గా దేవీ సాక్షాత్తూ సిద్ధిధాత్రి శాక్తేయానుసారముగా శ్రీ రాజరాజేశ్వరి దేవి ( Sri Rajarajeshwari Devi) గా దర్శనమివ్వనుంది.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు (Navratri 2020) దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, పందిళ్లల్లో కొలువైవున్న శ్రీ కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తోంది. ఈ మేరకు భక్తులు నిత్య ఉపావాసాలుంటూ.. నవరాత్రుల్లో రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్న అమ్మవారి కటాక్షం కోసం నిష్టగా పూజలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు.
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి వేడుకలు (Navratri 2020) అంగరంగ వైభవంగా.. కన్నులపండువగా కొనసాగుతున్నాయి. కనకదుర్గా దేవి (kanakadurga devi) నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ.. కోరిన కోరికలు తీర్చే ఆది పరాశక్తిగా విరాజల్లుతోంది. అమ్మవారి కటాక్షం కోసం నవరాత్రులపాటు భక్తులు ఉపవాసాలుంటూ.. నిష్టగా పూజలతో అమ్మవారి అనుగ్రహం కోసం పరితపిస్తున్నారు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా.. కన్నులపండువగా జరుగుతున్నాయి. నిత్య పూజలు అందుకుంటూ రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా దేవీని కొలిచి భక్తులు అమ్మవారి కటాక్షాన్ని పొందుతున్నారు. అయితే దేవి నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజు గురువారం కనకదుర్గా అమ్మవారు కాత్యాయని దేవీ (Maa Katyayani) శాక్తేయానుసారముగా లలితాత్రిపుర సుందరి దేవి ( Sri Lalitha Tripurasundari Devi ) అలంకారంలో భక్తులను అనుగ్రహించనుంది.
దేశవ్యాప్తంగా దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అలంకరణలో దర్శనమిస్తున్న కనక దుర్గా అమ్మవారిని కొలిచి అనుగ్రహన్ని పొందేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. దేవి నవరాత్రుల్లో భాగంగా ఐదో రోజు బుధవారం అమ్మవారు స్కంధమాత (సరస్వతీ దేవి) అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తోంది.
Navratri 2020 Fasting | దేవీ నవరాత్రులు ( Navratri 2020 ) ప్రారంభం అయ్యాయి. ఈ సమయంలో అమ్మవారి భక్తులు అత్యంత పవిత్రతతో, నిర్మళమైన మనస్సుతో తల్లిని పూజిస్తారు. తమను కష్టాల కడలిని దాటించమని వేడుకుంటారు.
Goddess Durga idols news updates: ముంబై: ప్రతీ సంవత్సరం, వినాయక చవితి సందర్భంలో, దుర్గాదేవి నవరాత్రులు సందర్భంలో కళాకారులు తమ ప్రతిభతో ప్రత్యేకమైన విగ్రహాలను సృష్టించడం గురించి కొన్ని వార్తలు మనం చూస్తుంటాం. అలాగే ఈసారి కూడా దుర్గాదేవి నవరాత్రులు ( Durga Devi Navratri 2020 ) ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల సందర్బంగా చేతన్ రావత్ అనే కళాకారుడు సృష్టించిన దుర్గా దేవి విగ్రహం అందరిని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.
Sattvic Drinks | దేవీ నవరాత్రుల ( Navratri ) సమయంలో చాలా మంది ఉపవాస దీక్ష ( Fasting ) తీసుకుంటారు. అయితే ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ సమయంలో ఎలాంటి భోజనం చేయాలి.. ఎలాంటి పానీయాలు తీసుకోవాలి అనే విషయంలో మాత్రం చాలా మంది ఆలోచనలో పడిపోతారు. అలాంటి వారికి ఈ టిప్స్.
ఓ వైపు పూల పండుగ బతుకమ్మ (Bathukamma).. మరోవైపు దేవీ శరన్నవరాత్రుల పూజలతో తెలంగాణ అంతటా సందడి నెలకొంది. అయితే ప్రకృతి పండుగ ( bathukamma festival ) ను పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు (M. Venkaiah Naidu) శుభాకాంక్షలు తెలిపారు.
పవిత్రమైన దేవీ నవరాత్రులు ( Navratri 2020 ) అక్టోబర్ 17 ప్రారంభం కానున్నాయి. దేశ వ్యాప్తంగా అమ్మవారి భక్తులు ఈ నెల 25 వరకు పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 25 లేదా 26న ముహూర్తాన్ని బట్టి విజయదశమి ( Vijayadashami ) వేడుకలు జరగనున్నాయి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మది రూపాలను భక్తులు పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి అశీస్సులు పొందడానికి ప్రయత్నిస్తారు.
నవరాత్రుల వేడుకలు ఘనంగా నిర్వహించడంలో గుజరాత్ తీరే వేరు. అయితే కరోనావైరస్ వల్ల ఈ సారి చాలా విషయాలు మారిపోయాయి. అందులో నవరాత్రుల వేడుకలు కూడా మినహాయింపు కాదు. ఈ సారి కళాకారులు నవరాత్రులకు ఎలా సిద్ధం అయ్యారో చూడండి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.