ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్లో కేంద్రానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసంను టీఆర్ఎస్ పార్టీ అడ్డుకుని బీజేపీకి మేలు చేసిందని వినిపిస్తున్న ఆరోపణలపై టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు.
కంపెనీలు లాభాల బాటలో నడుస్తుంటే.. కొంత సొమ్మును కార్మికులకు, సిబ్బందికి బోనస్‌గా ఇస్తుంటాయి. ఇది సర్వసాధారణం. అయితే ఈ విధానాన్ని ప్రభుత్వాలు పాటిస్తే.. వినడానికి విడ్డూరంగా ఉంది కదూ...!
అధికార పార్టీకి కీలకమైన త్రిపుల్ తలాక్ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు.
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్బి) కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం లోక్ సభలో ప్రవేశపెట్టబోయే త్రిపుల్ తలాక్ బిల్లును ఏకగ్రీవంగా తిరస్కరించింది.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు ఉదయమే ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కొత్తగా చేరిన సభ్యులను సభకు పరిచయం చేయడం జరిగింది. ఇటీవలే మరణించిన పార్లమెంటు సభ్యులకు నివాళులు అర్పించిన అనంతరం సమావేశాలను స్పీకరు సుమిత్ర మహాజన్ సోమవారానికి వాయిదా వేశారు.
పార్లమెంట్ హౌజ్‌లో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. కాకినాడ ఎంపీ తోట నరసింహం మీడియాకు తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని కోరుతూ 2015లో ప్రభుత్వానికి తాము వినతి పత్రాన్ని అందించినట్లు ఆయన ఈ సందర్బంగా తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.