Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ నోటీసులు కథనాలపై స్పందించిన కవిత

Kalvakuntla Kavitha on ED notice News: తాజాగా ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసినట్టుగా మీడియాలో కథనాలొచ్చాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు చేయొచ్చనే వార్తలు కూడా వినిపించాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 16, 2022, 09:21 PM IST
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ నోటీసులు కథనాలపై స్పందించిన కవిత

Kalvakuntla Kavitha on ED notice News: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కూడా భాగం ఉన్నట్టు గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి చెందిన బీజేపి నేతలు పర్వేష్ వర్మ, మజిందర్ సింగ్ చేసిన ఆరోపణలతో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కి ముడిపెడుతూ కేసీఆర్ కుమార్తె కవిత పేరు బయటికొచ్చింది. ఎప్పుడైతే బీజేపి నేతలు కవితపై ఆరోపణలు గుప్పించారో అప్పటి నుంచి కవితపై పుంకాను పుంకాల వార్తలు, కథనాలు వచ్చాయి. అయితే, అప్పట్లోనే తనపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు ప్రకటించిన కవిత.. ఇకపై తనపై ఎవ్వరూ అలాంటి ఆరోపణలు చేయడానికి వీల్లేదని కోర్టుకు వెళ్లడం మరింత హైలైట్ అయింది.

ఇదిలావుంటే, తాజాగా ఢిల్లీ మద్యం పాలసీలో అవినీతికి పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీచేసినట్టుగా మీడియాలో కథనాలొచ్చాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు చేయొచ్చనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో ఈ వార్తా కథనాలపై ట్విటర్ ద్వారా స్పందించిన కవిత.. కొంతమంది తప్పుడు ప్రచారంతో మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని, తనకు ఎలాంటి నోటీసులు రాలేదని స్పష్టచేశారు. వాస్తవాలు చూపించి ఆడియెన్స్ సమయం వృథా కాకుండా చూడాల్సిందిగా కోరుతున్నానని మీడియా సంస్థలకు కవిత విజ్ఞప్తి చేశారు. 

Also Read : KTR TARGET BJP: విశ్వ గురు వద్దంటారు.. ఆయన శిష్యుడేమో ఇస్తానంటారు! ఉచితాలపై బీజేపీని ఉతికిఆరేసిన కేటీఆర్

Also Read : Delhi Liquor Scam: లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్? సీబీఐ ఉచ్చులో కేసీఆర్ ప్యామిలీ.. నెక్స్ట్ టార్గెట్ సారేనా.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News