MP Komatireddy Letter to CM KCR: రైతు బంధు పథకంపై సీఎం కేసీఆర్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయోనని అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు కొంత వరకే విడుదల చేశారని.. పూర్తిస్థాయిలో అందరికీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
MLA Etala Rajender House Arrest in Hyderabad: బాటసింగారంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలనకు వెళ్లేందుకు సిద్ధమైన బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఇళ్ల నుంచి బయటకు రానియకుండా గృహ నిర్బంధం చేశారు.
TS Govt Declare Holidays: భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలకు నేడు, రేపు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో నేతలు కొత్తగా చేరాల్సిన అవసరం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బాంబ్ పేల్చారు. 12కు 12 స్థానాలు రిజర్వ్ అయిపోయాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, కోదాడ శశిధర్ రెడ్డి పార్టీలో చేరే అంశం ఇప్పటివరకు చర్చకు రాలేదన్నారు. త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రోడ్ మ్యాప్ కోసమే ముఖ్యనేతలను ఆహ్వానించానని అన్నారు. ఆగస్టు నుంచి ప్రచారాన్ని ఉధృతం చేస్తామన్నారు. అందరం కలిసికట్టుగా బస్ యాత్ర చేయాలనేది తన కోరిక అని అన్నారు.
YS Sharmila on Aarogyasri Scheme: ఆసుపత్రులకు పెండింగ్‌లో ఉన్న రూ.800 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. 9 ఏళ్లుగా ఆరోగ్యశ్రీని అమలు చేయకుండా.. లక్షల మంది ప్రాణాలు తీసిన పాపం కేసీఆర్‌దే అంటూ ఘాటు విమర్శలు చేశారు.
TPCC Leaders Meeting: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో బుధవారం టీపీసీసీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. అభిప్రాయ భేదాలు మరిచిపోయి.. ఇక నుంచి కలిసి పనిచేద్దామని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. త్వరలోనే బస్సు యాత్ర నిర్వహిస్తామని తెలిపారు.
YS Sharmila on CM KCR: సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు మాట మీద నిలబడే దమ్ముంటే.. ముందు రుణమాఫీ చేసి చూపించాలని డిమాండ్ చేశారు. రుణ మాఫీ పేరుతో రైతులకు బూటకపు హామీ ఇచ్చారని ఫైర్ అయ్యారు.
Revanth Reddy Letter To Telangana Farmers: బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై రైతులకు బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని.. ఇందుకు సబ్ స్టేషన్లలోని బుక్లే సాక్ష్యమని అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడుతోందన్నారు.
Revanth Reddy On Harish Rao: మంత్రి హరీష్ రావుపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వార్డు మెంబర్ కూడా కాలేని ఆయనను వైఎస్ఆర్ అప్పట్లో మంత్రిని చేశారని అన్నారు. కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడు అని చెప్పడానికి హరీష్‌కు సిగ్గుండాలంటూ ఫైర్ అయ్యారు.
Etela Rajender Fires On CM KCR: శామీర్‌పేట్‌లో రైతులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కలెక్టరేట్ ముందు ధర్నాకు అనుమతి ఇచ్చి.. అరెస్ట్ చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. రైతులతో మాట్లాడి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆమె కాంగ్రెస్‌లో చేరబోతున్నారా..? రాజకీయంగా తెలంగాణలో ఉంటారా..? ఏపీలో ఉంటారా..? అనేది చర్చనీయంశంగా మారింది.
Minister Harish Rao On Revanth Reddy: రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ నేతల మాటల దాడి ఇంకా ఆగడం లేదు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎలా ఇచ్చారో.. బీఆర్ఎస్ పాలనలో కరెంట్ ఎలా ఇస్తున్నామో ప్రజలను కోరదామని మంత్రి హరీష్ రావు అన్నారు.
Dasoju Sravan Kumar Got Threatening Calls: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోమంటూ తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలిపారు. ఈ కాల్స్‌పై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను గుర్తించి.. శిక్షించాలని కోరారు.
Wine Shope Closed in Hyderabad: బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఈ నెల 16 ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 17 సాయంత్రం 6 గంటల వరకు వైన్స్ బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Daifuku and Nicomac Taikisha in Ranga Reddy: జపాన్‌కి వెళ్లిన ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది నేర్చుకొని వస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లాలో రెండు భారీ కంపెనీలకు ఆయన శంకుస్థాపన చేశారు. 575 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కంపెనీలు ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.
SI Transfers In Telangana: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎస్సైల బదిలీలు చర్చనీయాంశమైంది. మరణించిన దుండిగల్ ఎస్సై బి.ప్రభాకర్ రెడ్డి పేరు కూడా టాన్సఫర్ ఆర్డర్స్‌లో ఉండడం విస్మయానికి గురిచేస్తోంది. పొరపాటును గుర్తించిన అధికారులు మార్పులు చేసి ఉత్తర్వులు జారీ చేశారు.
Komatireddy Venkat Reddy On Revanth Reddy: ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే తప్పేనని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. ఫ్రీ కరెంట్ అంశం రేవంత్‌కు సంబంధించినది కాదని.. హైకమాండ్ చూసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కరెంట్ సమస్యను కాంగ్రెస్ తీరుస్తాందని హామీ ఇచ్చారు.
Revanth Reddy Comments On Free Power To Farmers: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ నిలిపివేస్తామంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రంలో మంత్రులు, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ రైతులు వ్యతిరేకించాలని కోరారు.
మల్లు భట్టివిక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌లో చేరికపై ఆయన చర్చించారు. కొల్లాపూర్ సభలో ప్రియాంకగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.