Police Dept : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైద్రాబాద్ నగరంలో కొత్తగా నలభై పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని జీవో జారీ చేసింది. హైద్రాబాద్‌లో పన్నెండు ఏసీపీ జోన్లు, సైబరాబాద్‌లో మూడు డీసీపీ జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Amar Raja Company : తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ మహబూబ్ నగర్లో పర్యటించారు. దివిటిపల్లి వద్ద సుమారు రూ. 270 ఎకరాల్లో అమర్ రాజా లిథియం బ్యాటరీ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
Hyderabad Rains : తెలంగాణలో మరొక రెండ్రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే హైద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి.
వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు.
Telangana Inter Results 2023 Date: తెలంగాణలో వరుసగా పరీక్షల ఫలితాలు కానున్నాయి. రేపు పదో తరగతి ఫలితాలు విడుదల అవుతుండగా.. ఇంటర్ రిజల్ట్స్ డేట్‌పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మే 10న ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Revanth Reddy On CM KCR: ఈ నెల 8న సరూర్ నగర్లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా తరలిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రియాంక గాంధీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తారని చెప్పారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు.
YS Sharmila Complaint on Minister KTR: ఐటీ శాఖపై విచారణ జరపాలని కోరుతూ శుక్రవారం బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వైఎస్ షర్మిల. పేపర్ల లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు అంతా ప్రగతి భవన్ నుంచే కొనసాగుతోందన్నారు.
Harish Rao Comments On Governor Tamilisai Soundararajan: గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్‌పై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన బిల్లులు ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారని ప్రశ్నించారు. గవర్నర్‌కు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉంటే.. బీజేపీలో చేరి ఎక్కడైనా పోటీ చేయొచ్చన్నారు.
Hyderabad Outer Ring Road: ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల విషయంలో వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆస్తులను ప్రయివేట్‌కు కట్టబెట్టడం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే ఈ టెండర్లను రద్దు చేయాలని అన్నారు.
CM KCR Inaugurates BRS Party Central Office: ఢిల్లీలోని వసంత విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ సెంట్రల్ కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. మొత్తం నాలుగు అంతస్తుల్లో పార్టీ భవనాన్ని నిర్మించారు. మొదటి అంతస్తులో సీఎం కేసీఆర్ చాంబర్ ఏర్పాటు చేశారు.
Minister Puvvada : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాజాగా ఎన్టీఆర్‌ను కలిశారు. ఖమ్మంలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని ఎన్టీఆర్‌ను ఆహ్వానించేందుకు మంత్రి హైద్రాబాద్‌కు వచ్చారు.
NIMS Hospital Expansion: నూతన సచివాలయంలో మంత్రి హరీష్ రావు తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిమ్స్ ఆసుపత్రి విస్తరణపై అధికారులతో చర్చించారు. నిమ్స్‌లో నూతన భవన నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
YS Sharmila Fires on CM KCR: రైతులకు ముల్లు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటూ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోతే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో వర్షాలతో 2 లక్షల 34 వేల ఎకారాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు.
Asaduddin Owisi : ప్రతీ విషయంలో పొరుగుదేశం పాకిస్థాన్‌తో తమను పోల్చి చూడటం తగదని అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ. తమ దేశభక్తిపై అనుమానం అక్కర్లేదని అన్నాడు. తమను అవమానించేలా మీడియాపై వస్తోన్న వార్తలపై ఓవైసీ మండిపడ్డాడు.
KCR : రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో రోజురోజుకూ పరిపాలన దిగజారిపోతోందని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అన్నారు. చైతన్య వంతులున్న మహారాష్ట్రలో పరిస్థితులు బాగాలేదన్నారు. గుణాత్మకమైన అభివృద్దిని తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అని అన్నారు.
సీఎం కేసీఆర్ కార్మిక పక్షపాతి అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అన్ని రంగాల్లో దూసుకుపోతుందని.. హైదరాబాద్ అంటే ఓ చరిత్ర అని అన్నారు. బెంగుళూరు, ముంబై అన్ని పాతపడిపోయాయని అన్నారు.
నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మొట్టమొదటి సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలిసారి సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తుండడంతో ఆసక్తి నెలకొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.