Rain Likely To Play Spoilsport India vs South Africa 2nd T20. రెండో టీ20 మ్యాచ్కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయట. ఆదివారం సాయంత్రం మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Telangana Weather Report. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆదివారం, సోమవారం తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
AP Weather Report: బంగాళాఖాతంలోని వాయుగుండం కారణంగా ఇటీవలే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ చదురుమదురు వర్షాలు కురిశాయి. ఇప్పుడా వాయుగుండం తీరం దాటిన కారణంగా రానున్న మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పొడిగా ఉండడం సహా కోస్తా జిల్లాలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
AP Rain Forecast: ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్షసూచన! రానున్న రెండు మూడు రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
Weather forecast: చలికాలం పోయి ఎండాకాలం ప్రారంభమైంది. వేసవి తొలినాళ్లలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ సారి వేసవి ఉష్టోగ్రతలు సాధారణంకన్నా ఎక్కువగా ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తోంంది.
మూడు టీ20ల సిరీస్లో భాగంగా శ్రీలంకతో లక్నో వేదికగా జరిగిన మొదటి మ్యాచ్లో 64 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న భారత్.. మరో సమరానికి సిద్దమైంది. శనివారం సాయంత్రం ధర్మశాల వేదికగా జరగనున్న రెండో టీ20లో భారత్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లోనూ గెలిచి.. మరో టీ20 ఉండగానే సిరీస్ పట్టాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. రెండో టీ20 మ్యాచ్కు వరణుడి ముప్పు పొంచి ఉంది.
Rains in Telangana: తెలంగాణ రాష్ట్రానికి ఇవాళ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Weather forecast: తెలంగాణ రాష్ట్రం చలితో వణికిపోతోంది. గత రెండు మూడు రోజలుగా రాష్ట్రవ్యాప్తంగా అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
రాష్ట్రానికి మరో ముప్పు పొంచి ఉంది. ఈ నెల 29న అండమాన్ తీరంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో..రాయలసీమ, దక్షిణకోస్తాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
AP Weather updates today: అమరావతి: నేడు, రేపు ఏపీలో అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా నేడు నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Heavy rainfall in Telangana: తెలంగాణలో నేడు పలు చోట్ల భారీ వర్షాలు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Heavy rains due to low pressure in Bay of Bengal: జులై 23న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాగల రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.
Hilarious incident caught on camera goes viral: టీవీ రిపోర్టర్ లైవ్లో ఉండగా అనుకోకుండా అక్కడ ఏదైనా జరిగి ఆ రిపోర్ట్ అర్ధాంతరంగా ఆగిపోవడం, లేదా ఆ ఘటన హాస్యాస్పదంగా ఉంటే ఆ లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి దృశ్యాలు గతం మీరు ఎన్నో చూసుంటారు. కానీ ఆ తరహా వీడియోల్లో ఇంత ఫన్నీ వీడియో (Funny video) మాత్రం ఇంతకుముందు చూసుండరు... లేదా ఇలా కూడా జరుగుతుందా అని ఊహించి ఉండరు.
వాయువ్య బంగాళాఖాతంతో పాటు దానిని ఆనుకుని ఉన్న ఒడిశా తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడిందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా వుండే ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా మంగళవారం కోస్తాలో పలుచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురవగా.. రానున్న రెండు రోజుల పాటు కూడా కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.