రంజాన్ మాసం (Ramzan month) సమీపిస్తోంది. ఏప్రిల్ 23, గురువారం నాడు ప్రారంభం కానున్న రంజాన్ పవిత్ర మాసం మే 23, శనివారం నాడు ముగియనుంది. రంజాన్ మాసంలో (Ramadan month) సంప్రదాయం ప్రకారం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు జరపడం ఒక ఆనవాయితీ.
ఏపీలో బుధవారం కొత్తగా మరో 23 కరోనా వైరస్ పాజిటివ్ కేసులను గుర్తించినట్టు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు ఏపీలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 525కు చేరింది. కరోనా వైరస్ కారణంగా బుధవారం నాడు ముగ్గురు మృతి చెందారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఐదేళ్లుగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ ఓ ఆర్డినెన్సుని తీసుకురాగా.. ఆ ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నుంచి ఆమోదం సైతం లభించింది.
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో (Maharashtra-Telangana border) మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పోలీసులు అనుమానంతో ఆ రెండు ట్రక్కులను ఆపి తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది.
కరోనా వైరస్ (Coronavirus) ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తున్న తరుణంలో ఒకరి నుండి మరొకరు సోషల్ డిస్టన్సింగ్ (Social distancing) మెయింటేన్ చేయాల్సిందిగా కేంద్రం పిలుపునిచ్చింది. అలాగే జనం ఎక్కడా గుంపులు గుంపులుగా ఉండకూడదని.. సమూహాలుగా తిరిగే చోట వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు (WHO experts) సైతం విజ్ఞప్తిచేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi), ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (AP CM YS Jagan) కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు (KVP) లేఖలు రాశారు. ఢిల్లీలో తన నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేవీపీ మాట్లాడుతూ.. ఆ లేఖల్లోని సారాంశాన్ని వెల్లడించారు.
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరావుపై (AB Venkateshwar Rao) ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఖరారు చేస్తూ కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రాజకీయ పగల దృష్ట్యానే తనను అకారణంగా సస్పెండ్ చేశారని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించిన ఏబీ వెంకటేశ్వర రావుకి ఇది ఊహించని షాక్.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ( RIL) అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ముఖేష్ అంబానీ వెంట ఆయన కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త ఎంపీ పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. గురువారం చిత్తూరులోని పీవీకెఎన్ కాలేజ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు.
దేశంలో అలజడి సృష్టించిన పౌరసత్వ సవరణ చట్టం నుంచి, ఏపీలోనూ చర్చనియాంశమైన మూడు రాజధానుల ప్రతిపాదన వరకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీజేపి వైఖరి ఏంటనే విషయాన్ని స్పష్టంచేస్తూ ఏపీ బీజేపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మళ్లీ జడలు విప్పింది. కొలిమిగుండ్ల మండలం బెలుముగుహల వద్ద టీడీపీ నేత సుబ్బారావును ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. వేట కొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. సుబ్బారావు ఓ హోటల్ వద్ద టీ తాగుతుండగా గమనించిన ప్రత్యర్థులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.