Husband Harassment: హైదరాబాద్‌లో అమ్మాయి కాపురం మూవీ ఘటన.. ఆ వివరాలు..!

Husband Harassment: హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయి కాపురం సినిమా తరహా ఉదంతం బయటపడింది.

Written by - Alla Swamy | Last Updated : Aug 1, 2022, 05:20 PM IST
  • హైదరాబాద్‌లో మరో దారుణం
  • అమ్మాయి కాపురం సినిమా ఘటన
  • కేసు నమోదు చేసిన పోలీసులు
Husband Harassment: హైదరాబాద్‌లో అమ్మాయి కాపురం మూవీ ఘటన.. ఆ వివరాలు..!

Husband Harassment: అదనపు కట్నం కోసం కొందరు మృగాలుగా మారుతున్నారు. కట్టుకున్న భార్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పుతున్నారు. మరికొందరు దారుణంగా హతమారుస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలు వరుసగా బయట పడుతున్నాయి. తాజాగా శంషాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

శంషాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి 2016లో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.5లక్షల నగదు, 9 తులాల బంగారం, లక్షల విలువైన ఇతర సామాగ్రిని అందించారు. కొన్నేళ్లుపాటు వారి కాపురం సజావుగా సాగింది. ఉన్నట్టుండి అతడిలో మార్పు వచ్చింది. ఏ పని చేసుకోకుండా ఇంట్లో ఉండేవాడు. కొంతకాలం తర్వాత అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. 

అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో రహస్యంగా వీడియో తీయడం ఆరంభించాడు. పడక గదిలో అశ్లీల దృశ్యాలను తీశాడు. వాటిని సోషల్ మీడియా ద్వారా తన స్నేహితుడికి పంపాడు. ఇది గమనించిన బాధితురాలు..భర్తను నిలదీసింది. తన స్నేహితుడితో ఏకాంతంగా గడపాలని ఒత్తిడి తెచ్చాడు. వేధింపులను భరించలేకపోయిన ఆమె పోలీసులను ఆశ్రయించింది.

దీంతో భర్త, అత్త, మామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని అత్త, మామల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని వాపోయింది. వారంతా అతడికే సపోర్ట్ చేశారని..తన బంధువులతో కలిసి తనపై దాడి చేసి ఇంటి నుంచి బయటకు పంపారని చెబుతోంది.

Also read:Weather Update: తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్..హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ..!

Also read:Hyderabad Rains LIVE Updates: హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షాలు.. భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాల వాసులు..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News